వైరల్: పెళ్లిబంతిలో షాకింగ్ మూమెంట్.. వానలో తడుస్తూనే ఆరగిస్తున్న అతిధులు!

ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు నమ్మలేని విధంగా ఉంటున్నాయి.ఇలాంటివారు కూడా వుంటారా? అని ఆశ్చర్యపడేలా కొంతమంది కనబడుతున్నారు.ఏదిఎలా వున్నా, నెటిజన్లు మాత్రం వాటిని చూస్తూ తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు.ఇంటర్నెట్‌లోని ఈ మధ్య పెళ్ళితంతుకి సంబంధించిన వీడియోలు అనేకం వైరల్‌ అవుతుంటాయి.అటువంటి ఫన్నీ వీడియో మరోకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.అయితే ఈ వీడియోలో ఇంతకుముందు మీరు చూసిన వీడియోలను తలదన్నే విధంగా ఉంటుంది.

 Viral: Shocking Moment At The Wedding Ball Guests Are Getting Wet In The Rain,-TeluguStop.com

ఇక ఈ వీడియోని చూసి మీరు ఖచ్చితంగా నవ్వకుండా అయితే ఉండలేరు. భోజనం అంటే ఇంత పిచ్చి వుంటుందా? అని అనిపించకమానదు.ఇక వీడియోలో ఏముందో చూస్తే… వారంతా ఓ పెళ్లికి వెళ్లి భోజనం చేయడానికి వరుసగా కూర్చున్నారు.ఇంతలో అకస్మాత్తుగా వర్షం పడింది.

దాంతో కొంతమంది ఠక్కున లేచిపోయి వెళ్లిపోయారు.అయితే కొంతమంది మాత్రం వర్షాన్ని బేఖాతరు చేస్తూ.

తడుస్తూనే తమ ఆహారాన్ని ఆరగించారు.ఇంతలో ఏదో ఐడియా వచ్చిన వాళ్ళలాగా తమ వెనుక వున్న ఖాళీ కుర్చీలను తడవకుండా తమ తలపైన పెట్టుకున్నారు.

మరో చేత్తో హాయిగా భోజనం చేస్తున్నారు.ఈ వీడియో చూసిన నెటిజన్లు పగలబడి నవ్వుకుంటున్నారు.

ఇకపోతే, ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో mr_90s_kidd_ అనే ఖాతాతో పోస్ట్ చేయగా ఇప్పటివరకు దానిని లక్షలాది మంది వీక్షించారు.ఇప్పటివరకు ఈ వీడియోను 1.9 మిలియన్ల మంది లైక్ చేయగా ఆ సంఖ్య ఇంకా కొనసాగుతూ వుంది.ఈ వీడియోపై నెటిజన్లు కూడా ఫన్నీ కామెంట్స్ తో విరుచుకుపడుతున్నారు.“ఆహారం పట్ల మక్కువ ఉంటే ఇలాగే ఉంటుంది!” అని ఒకరంటే, ఆకలి ఒక వ్యక్తి తో ఏదైనా చేయిస్తుందని మరో నెటిజన్‌ కామెంట్‌ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube