వైర‌ల్‌.. దోమ ఎలా గుడ్లు పెడుతుందో చూడండి..

దోమ‌లు అంటే తెలియ‌ని వారుండ‌రేమో.రాత్ర‌యితే చాలు ఇంట్లోకి ఎంట‌ర్ అయిపోయి నిద్ర లేకుండా చేస్తుంటాయి.

 Viral .. See How The Mosquito Lays Eggs ..viral Video, Mosquito, Viral , Viral I-TeluguStop.com

చాలా వ‌ర‌కు ఈ దోమ‌లు రోగాల‌ను కూడా మోసుకొస్తుంటాయి.అందుకే వాటిని నిర్మూలించేందుకు చాలా ప్ర‌య‌త్నాలు చేస్తుంటాం.

కొన్ని సార్లు వీటివ‌ల్ల ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు.ఎందుకంటే ఇవి ఎంత ప్ర‌మాద‌క‌ర‌మో అంద‌రికీ తెలిసిందే.

వీటి వ‌ల్ల డెంగ్యూ, మ‌లేరియా లాంటి ప్ర‌మాద‌క‌ర వ్యాధులు వ్యిపిస్తుంటాయి.అందుకే ప్ర‌భుత్వాలు కూడా వీటిని కంట్రోల్ చేసేందుకు చాలా ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తుంటాయి.

అయితే ఇప్పుడు సోస‌ల్ మీడియాలో దోమ గురించి ఓ వీడియో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తోంది.సోష‌ల్ మీడియా అంటేనే ఏదో ఒక వైర‌ల్ వీడియోను పాపుల‌ర్ చేస్తూనే ఉంటుంది.

ఇదే క్ర‌మంలో దోమ‌కు సంబంధించిన ఈ వీడియోను చూసి అంద‌రూ షాక్ అయిపోతున్నారు.మ‌న‌కు దోమ అస‌లు ఎప్పుడూ క్లారిటీగా క‌నిపించ‌దు.దాన్ని ఏదో గాల్లో ఎగురుతున్న‌ప్పుడు చూడాల్సిందే త‌ప్ప దాని ముఖం మాత్రం మ‌న‌కు క‌నిపించ‌దు.అలాంటిది దోమ గుడ్లు పెట్ట‌డాన్ని చూస్తామా అస‌లు సాధ్యం కాదు క‌దా.

కానీ ఈ వీడియోలో మాత్రం దోమ గుడ్లు పెట్టడం చాలా క్లియ‌ర్‌గా ఉంది.

దోమ త‌మ గుడ్ల ద్వారానే పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిస్తుంటాయి.అందుకే ఈ దోమ గుడ్ల‌ను నాశ‌నం చేసేందుకు నిలిచి ఉన్న నీటిమీద ఇత‌ర మారుమూల ప్రాంతాల్లోనూ ఈ గుడ్ల‌పై మందులు పిచికారి చేస్తుంటారు.అలాంటిది ఇప్పుడు మ‌నం చూస్తున్న వీడియోలో మాత్రం ఓ దోమ ఎలా గుడ్లు పెడుతుందో క‌నిపిస్తోంది.

ఈ వీడియోలో ఆ దోమ ఒకేసారి ఏకంగా 500 గుడ్ల దాకా పెట్ట‌డం చూడొచ్చు.ఇక్క‌డ ఓ విష‌యం ఏంటంటే ఆ దోమ గుడ్ల‌ను నినిటారుగా నిలబడేలా పెట్టడాన్ని చూస్తుంటే దాని జాగ్ర‌త్త చాలా బాగా అర్థం అవుతోంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube