Building Hayat Nagar : వైరల్: 8.8 గజాల్లోనే రెండంతుస్తుల భవనం ఎలా నిర్మించారో చూడండి!

బడాబాబుల పుణ్యమాని రియల్ ఎస్టేట్ రంగం రోజురోజుకీ అభివృద్ధి చెందుతోంది.దాంతో సామాన్యుడికి సొంతిల్లు కల అనేది కలలాగే మిగిలిపోతోంది.

 Viral  See How A Two-storied Building Was Built In 8.8 Yards , 8.8 Cents, Viral-TeluguStop.com

ఈ క్రమంలో కాస్త విభిన్నంగా ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది.లేదంటే ఇలాంటి నిర్మాణాలు చేపట్టాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి.

మనసుంటే మార్గముంటుంది అని అంటారు.ఆలోచిస్తే ఎంత చిన్నదైనా ఎంతో పెద్ద ప్రయోజనం చేకూరుస్తుందని.

మనకు ఉన్న వనరుల్లో సరిగా వాడుకుంటే ఏదైనా మనకు ఉపయోగకరంగా ఉంటుంది అని ఒకతను కార్యం రూపంలో చూపించాడు.

భూముల విలువ ప్రస్తుతం ఆకాశాన్నంటుతోంది.

గుంట స్థలం కావాలన్నా రూ.లక్షలు పెట్టాల్సిన పరిస్థితి.దీంతో పట్టణవాసం అత్యంత ఖరీదుగా మారింది.నగరంలో స్థలం దొరకాలంటే మన ఆస్తులు అమ్మేసినా దొరకడంలేదు.

హైదరాబాద్ లాంటి చోట్ల స్థలం కొని ఇల్లు కట్టాలంటే ఆషామాషీ కాదు.ఈ నేపథ్యంలో నగరంలోని హయత్ నగర్ మండలం కుంట్లూరులో ఓ యజమాని తనకున్న స్థలాన్ని విక్రయించగా ఓ 8.8 గజాల స్థలం మిగిలింది.దాన్ని ఏం చేయాలో అర్థం కాకపోవడంతో వట్టిగా ఉంచడమెందుకని ఓ భవనం నిర్మించాలని మాస్టర్ ప్లాన్ చేశాడు.

అనుకున్నదే తడవుగా ఆ స్థలంలోనే రెండంతస్తుల భవనం నిర్మించి ఆశ్చర్యం కలిగించాడు.అందరు గుంట స్థలమైనా చాలదని భావిస్తున్న నేపథ్యంలో అతడు మాత్రం 8.8 గజాల్లోనే రెండంతస్తులు నిర్మించడం అందరిలో ఆలోచనలు రేపాడు.గ్రౌండ్ ఫ్లోర్ లో ఓ కార్యాలయం, పైన అటాచ్ డ్ బాత్ రూం కట్టి అద్దెకు ఇచ్చాడు.

ఒక వైపు నుంచి చూస్తే ఆ భవనం ఓ ప్రహరీ గోడలా కనిపిస్తుంది.ఇంత చిన్న స్థలంలో ఇంత పెద్ద భవనం నిర్మించడం అతడికే చెల్లిందని కితాబిస్తున్నారు.

అతడి తెలివికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube