వైరల్: కేవలం 7 మామిడి పండ్లకు ఇంత సెక్యూరిటీనా.. అసలు మ్యాటర్ ఏంటంటే..?!

వేసవి కాలం వచ్చిందంటే చాలు ఎండలు మండిపోతాయి కదా.ఎండల మాట పక్కన పెడితే వేసవి కాలం కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు.

 Viral Security With Four Men And Dogs For Rare Ruby Color Mangoes In Bhopal-TeluguStop.com

ఎందుకంటే వేసవి సీజన్ లో మామిడి పండ్లు విరిగిగా దొరుకుతాయి కాబట్టి.మామిడి పళ్ళు తినడానికి ఎంతో రుచికరంగా ఉంటాయి.

దానిని మించిన పండు మరొకటి లేదు.అందుకే మామిడి పండును పండ్లలో కంటే రారాజు అని పిలుస్తారు.

 Viral Security With Four Men And Dogs For Rare Ruby Color Mangoes In Bhopal-వైరల్: కేవలం 7 మామిడి పండ్లకు ఇంత సెక్యూరిటీనా.. అసలు మ్యాటర్ ఏంటంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే మామిడి పండు ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరకదు.ఈ పండు సీజనల్ టైమ్ లో మాత్రమే దొరుకుతుంది.

ఆ సమయంలో మామిడి పండ్లకు గిరాకీ బాగా ఉంటుంది.

అయితే భోపాల్ లో ఉన్న మామిడి చెట్టుకు మాత్రం ఒక ప్రత్యేకత ఉంది తెలుసా.ఆ మామిడి చెట్టుకు కాసిన మామిడి పండ్లు కేజీ రూ.2.70 లక్షల ధర పలుకుతుందట.ఏంటి అంత ధరా.అని షాక్ అయ్యారా.? కానీ మీరు విన్నది నిజమే అండి.అంతేకాదు ఆ చెట్టుకి ఆరు శునకాలు, నలుగురు సిబ్బంది కూడా కాపలాగా ఉన్నారు తెలుసా.ఇంతకీ ఆ చెట్టుకు ఉన్న ప్రాధాన్యత ఏంటి.? అసలు అంత ధర పలకడానికి కారణం ఏంటి.? అనే విషయాలు ఒకసారి తెలుసుకుందాం.మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్‌ పూర్ జిల్లాకు చెందిన రాణి, సంకల్ప్ పరిహార్ అనే దంపతులు తమ మామిడి తోటలో ఒక రెండు మామిడి మొక్కలను నాటారు.

Telugu 7 Mangos, Jabalpur, Madhya Pradesh, Main Reason, One Kg 2.7 Lakh Rupees, Rare Mangoes, Ruby Color Mangoes, Security, Viral Latest, Viral News-Latest News - Telugu

అయితే అవి పెరిగి పెద్దవడంతో ఆ చెట్లకి పోయిన సంవత్సరం వాటికి మామిడి పండ్లు కాచాయి.అవి పండిన తరువాత వాటిని గమనిస్తే అవి పసుపు రంగులో కాకుండా రూబీ కలర్‌ లో ఉన్నాయి.చివరకు అవి జపాన్‌ కు చెందిన మియాజాకీ మామిడి పండ్లు అని తేలింది.

మామిడి పండ్ల ధర అంతర్జాతీయ మార్కెట్‌ లో ఏకంగా కిలో రూ.2.70 లక్షలుగా పలుకుతుంది.ఈ మామిడి పండ్లకు భారీ ధర పలకడంతో పోయిన ఏడాది చెట్లకు కాచిన మామిడి పండ్లను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు.

మళ్ళీ ఈ ఏడాది ఆ రెండు చెట్లకు 7 మామిడి పండ్లు కాచాయి.

Telugu 7 Mangos, Jabalpur, Madhya Pradesh, Main Reason, One Kg 2.7 Lakh Rupees, Rare Mangoes, Ruby Color Mangoes, Security, Viral Latest, Viral News-Latest News - Telugu

మళ్ళీ వాటిని ఎవరన్నా దొంగిలిస్తారేమో అనే అనుమానంతో ఆ 7 పండ్లకు 6 శునకాలను, నలుగురు సిబ్బందిని కాపలాగా ఉంచారన్నమాట.ఈ మామిడి పండ్లు ఇండియాలో పండే పండ్ల మాదిరిగా ఉండవు.రూబీ కలర్‌ లో ఉండి, అంతర్జాతీయ మార్కెట్‌ లో అత్యంత డిమాండ్ కలిగి ఉంటాయి.

ఆ మామిడి పండ్లు అత్యంత అరుదుగా మన దేశంలో పండుతాయి కాబట్టి వీటికి అంతా డిమాండ్ ఉంది మరి.

#Main Reason #OneKg #Security #Rare Mangoes #7 Mangos

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు