వైరల్: ఎలర్జీ లేని పాల కోసం ఏకంగా రష్యా శాస్త్రవేత్తల కొత్త సృష్టి..!

పాలు ఆరోగ్యానికి ఎంతో మంచిది అని వైద్యులు చెబుతూ ఉంటారు.అందుకనే ప్రతి రోజు పిల్లలు, పెద్దలు ఒక గ్లాసు పాలు తాగితే ఆరోగ్యంగా, బలంగా ఉంటారు.

 Viral: Russian Scientists Create New Product For Non-allergic Milk ..! Cloing Co-TeluguStop.com

అయితే కొంత మందికి మాత్రం ముక్యంగా చిన్నపిల్లలకు ఆవు, గేదెల పాలు తాగిస్తే ఒక్కోసారి అవి అరగవు.ఆ పాలు తాగిన తర్వాత కొంతమంది పిల్లలో కడుపునొప్పి వస్తుంది.

ఎప్పుడన్నా గమనించారా.దానికి కారణం ఏంటో తెలుసా పాలల్లో ఉండే బీటా-లాక్టోగ్లోబులిన్‌ దీనికి కారణం.

దీనినే మనం లాక్టోజ్ అని కూడా అంటాము.మరి లాక్టోజ్ లేని పాలు దొరకడం అంటే కష్టం కదా అని అనుకుంటున్నారా ఈ క్రమంలోనే అజీర్తికి కారణమయ్యే ఈ లాక్టోగ్లోబులిన్‌ లేకుండా పాలను ఉత్పత్తి చేసేలా ఒక ఆవును రూపొందించారు రష్యా శాస్త్రవేత్తలు.

అది ఎలా సాధ్యం అని అనుకుంటున్నారాఆవు జన్యువులలో కొన్ని ప్రత్యేక మార్పులు చేయటం ద్వారా ఒక క్లోనింగ్ ఆవును రూపొందించారు శాస్త్రవేత్తలు.ఈ పరిశోధనలను మాస్కోలోని స్కోల్కోవో ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన ఎర్నెస్ట్ ఫెడరల్ లైవ్ స్టాక్ సైన్స్ సెంటర్ పరిశోధకులు చేసారు.

ఈ ప్రయోగాల ఫలితంగానే క్లోనింగ్ ఆవు దూడ జన్మించింది.సోమాటిక్ సెల్ న్యూక్లియర్ ట్రాన్సఫర్ పద్దతిని ఉపయోగించి ఆవు దూడను రూపొందించారు.ప్రస్తుతం క్లోనింగ్ ఆవు దూడ ఆరోగ్యంగా పెరుగుతుంది అని తెలుస్తుంది.

Telugu Cow, Flash, Russia, Latest-Latest News - Telugu

ఈ అవు దూడ 2020 ఏప్రిల్ లో జన్మించగా ప్రస్తుతం దాని వయ్యస్సు 14నెలలు.అలాగే ఆ ఆవు దూడ పుట్టినప్పుడు 63 కిలోలు ఉండగా ఇప్పుడు అది 410 కిలో గ్రాముల బరువు ఉండడంతో పాటు ఆవు దూడ కూడా ఆరోగ్యంగానే పెరుగుతుందని పరిశోధకులు తెలిపారు.ఈ ప్రయోగం వలన భవిష్యత్తులో హైపో ఎలెర్జిక్ పాల ఉత్పత్తి జరుగుతుంది అని తెలిపారు.

ఈ ప్రయోగం కనుక విజయవంతం అయితే ఈ క్లోనింగ్ ఆవు ద్వారా ఇలాంటి మరికొన్ని ఆవులను వృద్ధి చెందించనున్నట్టు శాస్ర్రవేత్తలు పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube