వైరల్: ఆ ఫెస్ట్ కు హాజరు అవ్వాలంటే అది ఖచ్చితంగా ఉండాలట..!

బట్టతల అంటే చాలా మంది మగవారు ఫీల్ అవుతుంటారు.ఈ కాలంలో అయితే వయసు సగం కూడా పూర్తి కాకుండానే బట్టతల వచ్చేస్తుంది.

 Viral Rubulod Club Fest Only For Who Having Bald Head, Blast Festival, Viral Lat-TeluguStop.com

ఎంతో వర్క్ స్ట్రెస్, వాటర్ ప్రాబ్లెమ్ వల్ల ఈ సమస్య మగవారిని తెగ ఇబ్బంది పెడుతుంది.స్నేహితులతో కలిసి తిరుగుతుంటే.

ఏంట్రా అప్పుడే సగం ఎకరం ఎండిపోయిందని హేళన చేస్తుంటారు.దీంతో అప్పటి వరకు హుషారుగా ఉన్నవారు కూడా ఒక్కసారిగా ఢీలా పడిపోతారు.

తల నుంచి నాలుగు వెంట్రుకలు జారీ కిందపడితే చాలు ఎదో కోల్పోయినట్టుగా భయపడతారు.కొందరైతే బట్టతల వస్తే సగం జీవితం అయిపోయిందని అనుకుంటుంటారు.

అయితే నిజానికి ఈ బట్టతల టెన్సన్స్, నిద్రనిద్రలేమి వల్ల వస్తాయి.అలాగే ప్రొటీన్స్ లోపం వల్ల కూడా జుట్టు ఊడుతుంది.

ఈ బట్టతల వల్ల చాలా మంది నలుగురిలో కలవలేకపోతున్నారు.చాలామంది బట్టతల వస్తే పెళ్లి కూడా జరగదేమో, నాకు పిల్లను ఎవ్వరు ఇవ్వరేమో అని అదోరకంగా వేదనలో పడిపోతారు.

అయితే వీరందరిని ఉత్సాహారపరిచే ఒక పండుగ ఉంది.అదే ‘బట్టతల పండుగ‘.ఈ పండగను న్యూయార్క్‌ లో నిర్వహిస్తారు.బట్టతల ఫెస్టివల్ ను బ్రూక్లిన్ లోని రుబులాడ్ క్లబ్ లో జరుగుతుంది.

అయితే ఈ పండుగకు హాజరవ్వాలంటే కచ్చితంగా బట్టతల ఉండాలి.బట్టతల లేకపోతే నో ఎంట్రీ.

ఈ పండుగను చాలా గ్రాండ్ గా నిర్వహిస్తారు.ఈ ఫెస్టివల్ కు వెళ్లాలంటే రూ.18 డార్లు ఎంట్రీ ఫీజు చెల్లించి రావాలి.అయితే ఫెస్టివల్ కి హాజరయితే సరిపోదు.

అసలు బట్టతల ఎందుకు వస్తుంది.వస్తే భయపడాలా, జుట్టు పోతే జీవితం పోయినట్టు కాదని బూస్టింగ్ స్పీచ్ లు ఇవ్వాలి.

ఈ స్పీచ్ లో ఎక్కువ మంది మాట్లాడుతూ బట్టతల అనేది శాపం కాదు.అది వచ్చినంత మనకేమీ నష్టం జరుగదని చెబుతారు.

Telugu America, Bald, Festival, Brooklynn, Fest, Latest-Latest News - Telugu

వీరి కోసం వీక్ ఫెస్ట్‌ లు జరుగుతాయి.పోటీలు కూడా ఉంటాయి.చాలా ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది.పాటలు, డ్యాన్సులు, కామెడీ స్కిట్స్ చేస్తారు.ఈ బట్టతల ఫెస్ట్ ను యూఎస్ రాపర్ రమి ఈవెన్ ఎష్ ప్రారంభించారు.యూఎస్‌లో జుట్టురాలే సమస్య రోజురోజుకూ పెరుగుతోంది.

యూఎస్ మొత్తం మీద 5 కోట్ల మంది పురుషులు, 3 కోట్ల మంది మహిళలకు ఈ జుట్టు రాలే సమస్య ఉందని.వారికి బట్టతల ఉన్నట్టు నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ వెల్లడించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube