వైరల్: పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు సహాయంగా పనిచేసిన రోబోలు..!

ఈ మధ్యకాలంలో పలుచోట్ల రోబోల ఉపయోగం ఎక్కువగా ఉండడం మనం చూస్తూనే ఉన్నాం.ఇదే నేపథ్యంలో తాజాగా కేరళ రాష్ట్రంలో జరిగిన పోలింగ్ కేంద్రంలో ఎన్నికల అధికారులు ఓటర్ల కు సహాయంగా రోబోలను రంగంలోకి తీసుకువచ్చారు.

 Sayabot, Robot, Polling Booth, Kerala, Carona Virus, Face Mask, Sanitizer, Keral-TeluguStop.com

తాజాగా కేరళ రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా పోలింగ్ కేంద్రాలలో రోబోలు ఓటర్లకు సహాయపడే విధంగా వాటిని ఉపయోగించారు.కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నా నేపథ్యంలో ఇలాంటి ఆలోచన చేయడం నిజంగా మెచ్చుకోదగ్గ విషయం.

కేరళలోని ఎర్నాకుళం జిల్లా ఎన్నికల అధికారులు ఓ పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు సేవలను అందించేందుకు వీలుగా ఓ రోబోను రంగంలోకి దించారు.

రోబో పేరు సయాబోట్.

ఈ రోబో పోలింగ్ కేంద్రానికి ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లను పలకరించి ఆ తర్వాత వారి శరీర ఉష్ణోగ్రతను పరిశీలిస్తుంది.అంతే కాదు ఓటు వేసే ముందు వారికి శానిటైజర్ ను కూడా అందజేస్తుంది.

ఇందులో భాగంగా ఓటరు నిర్దిష్ట శరీర ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉంటే మాత్రం ఆ రోబో సదరు వ్యక్తిని పోలింగ్ అధికారిని సంప్రదించవలసినదిగా సలహా కూడా ఇస్తుంది.

అంతేకాదండోయ్…ఈ రోబో ఓటు వేయడానికి వచ్చిన వ్యక్తికి ఫేస్ మాస్క్ సరిగా లేకపోయినా, ఎవరైనా సామాజిక దూరం పాటించకపోయినా రోబో వెంటనే వారిని అలెర్ట్ చేసి చెప్పడంతో ఆ రోబో ఇప్పుడు విశేషంగా ప్రజలను ఆకట్టుకుంటోంది.ఓటర్లు ఎవరైనా సరే శానిటైజర్ ఉపయోగించకుండా ఓటు వేసేందుకు వచ్చిన వారికి ఖచ్చితంగా శానిటైజర్ ఇచ్చి వారిని ఓటు వేసేందుకు అనుమతిస్తుంది.ఈ విషయం సంబంధించి.

అధికారులు ఈ రోబోను పోలింగ్ కేంద్రంలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టి వాటి సేవలను పరిశీలించమని వీటి పనితీరు చాలా బాగుండడంతో రాబోయే కాలంలో ఇతర పోలింగ్ కేంద్రాల్లోనూ ప్రవేశపెడతామని కేరళ రాష్ట్ర ఎన్నికల అధికారులు మీడియాతో మాట్లాడారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube