రష్మిక ఏమైంది నీకు.. ఆ డ్రెస్ ఏంటి.. నీపై ఈ ట్రోల్స్ ఏంటి?

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.చలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది ఈ బ్యూటీ.

 Viral Rashmika Mandanna Spotted Airport Fans Trolls Her Dress Sense Dressing Sense , Rashmika Mandanna , Tollywood, Pushpa, Bheeshma-TeluguStop.com

ఆ తరువాత సినిమాలలో తనదైన శైలిలో నటిస్తూ తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది.చలో సినిమా తర్వాత విజయ్ దేవరకొండ సరసన గీత గోవిందం సినిమాలో నటించి ఒక్కసారిగా పాపులర్ హీరోయిన్ గా మారింది.

తర్వాత సరిలేరు నీకెవ్వరు సినిమాతో ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిపోయింది.అంతేకాకుండా ఈమె తన అందంతో నేషనల్ క్రష్ గా కూడా మారింది.

 Viral Rashmika Mandanna Spotted Airport Fans Trolls Her Dress Sense Dressing Sense , Rashmika Mandanna , Tollywood, Pushpa, Bheeshma -రష్మిక ఏమైంది నీకు.. ఆ డ్రెస్ ఏంటి.. నీపై ఈ ట్రోల్స్ ఏంటి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రష్మిక ఇప్పటివరకూ తెలుగులో చలో, గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, డియర్ కామ్రేడ్, భీష్మ, పుష్ప లాంటి సినిమాల్లో నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఈ భామ రీసెంట్‌గా వచ్చిన పుష్ప సినిమాతో మరో బ్లాక్‌ బస్టర్‌ని తన ఖాతాలో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

కేవలం తెలుగులోనే మాత్రమే కాకుండా తమిళం, హిందీ భాషల్లోనూ వరుస సినిమాలు చేస్తూ మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా మారింది.ఇదిలా ఉండగా తాజాగా రష్మిక మందన్న ముంబై ఎయిర్‌పోర్టులో కనిపించింది.

అయితే ఆమె వేసుకున్న డెనిమ్‌ షార్ట్‌ మరీ పొట్టిగా ఉండటంతో నెటిజన్స్ తెగ ట్రోల్‌ చేస్తున్నారు.

రష్మిక డ్రెస్సింగ్‌ చాలా ఓవర్‌గా ఉందంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.దీనికి సంబంధించిన వీడియోను వైరల్‌ చేస్తూ.ప్యాంట్‌ వేసుకోవడం మర్చిపోయావా? ఇంక నువ్వు బట్టలు వేసుకోవడం దేనికి అంటూ ఈ అమ్మడిపై ఫైర్‌ అవుతున్నారు నెటిజన్స్.స్కిన్ షో చేయొచ్చు కానీ, ఇది టూ మచ్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు.మొత్తానికి ఈ విషయంలో రష్మిక మందన్న ని నెటిజన్స్ ఒక రేంజ్ లో ట్రోలింగ్స్ చేయడమే కాకుండా ఆమెను ఏకిపారేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube