వైరల్ : 'దీదీ ఓ దీదీ' అంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్..!

పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించారు.ఈ విజయం పై రాంగోపాల్ వర్మ స్పందించారు.

 Viral Ram Gopal Varma Tweet On West Bengal Assembly Elections-TeluguStop.com

మమత విజయం పై వర్మ తన క్రియేటివిటీకి పదును పెట్టి ఓ వీడియోని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.ఓ షార్ట్ వీడియోను షూట్ చేయించి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

దీనికి ‘దీదీ ఓ దీదీ’ అని పేరు పెట్టారు.ఇందులో మమతా బెనర్జీతో పాటు నరేంద్ర మోదీ, అమిత్ షాలు నటించారని కామెంట్ చేశారు.

 Viral Ram Gopal Varma Tweet On West Bengal Assembly Elections-వైరల్ : దీదీ ఓ దీదీ’ అంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈ వీడియోలో ఓ హ్యాండ్ బ్యాగ్ తో ఒంటరిగా వస్తున్న యువతిపై, వెనుక నుంచి ఓ హై ఎండ్ బైక్ పై వచ్చిన ఇద్దరు అటకాయిస్తారు.ఈలోగా పారిపోయినట్టుగా పరిగెత్తే ఆ యువతి, తన చేతిలోని బ్యాగ్ ను దూరంగా విసిరేస్తుంది.

వెంటనే ఆ ఇద్దరు బ్యాగ్ కోసం పరిగెత్తగా, వారు తెచ్చిన బైక్ ను ఎంచక్కా నడుపుకుంటూ వెళ్లిపోతుందా యువతి.

వీడియోను చూసిన బీజేపీ ఫాలోవర్స్ వర్మ పై విరుచుకుపడుతున్నారు.

మిగతా వారు మాత్రం వర్మ క్రియేటివిటీని పొగడుతున్నారు.మరో వైపు నందిగ్రామ్‌ లో మ‌మ‌త ఓట‌మిని జీర్ణించుకోలేని తృణముల్ కాంగ్రెస్ నేతలు అక్కడ రీకౌంటింగ్ చేయాల‌ని ప‌ట్టు బ‌ట్టారు.

ఆదివారం జ‌రిగిన ఓట్ల లెక్కింపులో సువేందు అధికారి 1736 ఓట్ల తేడాతో మ‌మ‌త‌ను ఓడించిన విష‌యం తెలిసిందే.అయితే ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ మాత్రం రీ కౌటింగ్ ‌కుద‌రదని తేల్చిచెప్పింది.

వీవీ ప్యాట్ స్లిప్స్‌ ను లెక్కించిన త‌ర్వాత ఫ‌లితాన్ని అధికారికంగా ప్ర‌క‌టిస్తామ‌ని రిట‌ర్నింగ్ ఆఫీస‌ర్ స్ప‌ష్టం చేశారు.అయితే కౌంటింగ్ ప్ర‌క్రియ‌పై తృణ‌మూల్ అనుమానాలు వ్య‌క్తం చేసింది.

అంతేకాదు కోర్టుకు కూడా వెళ్తామ‌ని ముఖ్య‌మంత్రి మ‌మ‌త ప్ర‌క‌టించారు.

#ViralVideo. #Mamtha Benerjee #Amit Shah #Viral Tweet #Nandigram

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు