వైరల్: కదులుతున్న రైల్లో నుంచి దూకేసిన మహిళను రక్షించిన కానిస్టేబుల్..!

పది రోజులు క్రితం ఓ రైల్వే మ్యాన్ తన ప్రాణాలకు తెగించి ట్రాక్ పై వస్తున్న రైలు కి ఎదురుగా వెళ్లి మరీ ఓ చిన్నారి ప్రాణాలు కాపాడిన సంఘటనను మర్చిపోకముందే మరోసారి కదులుతున్న రైలు నుండి దిగేందుకు ప్రయత్నిస్తున్న మహిళను, ఆవిడ భర్తను తాజాగా ఓ రైల్వే కానిస్టేబుల్ ప్రాణాపాయం నుండి రక్షించాడు.ఈ సంఘటన తాజాగా తిరుపతి రైల్వే స్టేషన్ లో చోటుచేసుకుంది.

 Viral Railway Constable Protected A Woman And Her Husband Stepping Down From The Running Train-TeluguStop.com

నేడు ఉదయం నాలుగున్నర గంటల సమయంలో తిరుపతికి తిరుమల ఎక్స్ప్రెస్ చేరుకోగా ట్రైన్ లో నుండి ఓ కుటుంబం స్టేషన్లో దిగాల్సి ఉంది.అయితే తెల్లవారుజామున కావడంతో తమ గమ్యస్థానం వచ్చిందని గమనించకుండా ఆదమరచి నిద్రపోతున్న కుటుంబం ఒక్కసారిగా తను దిగాల్సిన స్టేషన్ వచ్చిందని గ్రహించడంతో వారు హుటాహుటిన రైలు దిగే ప్రయత్నం చేశారు.

ఈ ప్రయత్నంలోనే ఆ కుటుంబానికి చెందిన ఓ యువతి రైలు నుండి ప్లాట్ ఫారం మీదికి దిగగా ఆ వెంటనే ఉన్న మరో మహిళ కూడా కదులుతున్న రైలు నుండి ఫ్లాట్ ఫామ్ పై దిగేందుకు ప్రయత్నం చేసింది.అయితే ఇదంతా గమనిస్తున్న రైల్వే కానిస్టేబుల్ సతీష్ కాస్త దూరం నుండే ఆ మహిళను వారించారు కూడా.

 Viral Railway Constable Protected A Woman And Her Husband Stepping Down From The Running Train-వైరల్: కదులుతున్న రైల్లో నుంచి దూకేసిన మహిళను రక్షించిన కానిస్టేబుల్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆయన తన మహిళ ఆ రైలు దిగేందుకు ప్రయత్నం చేయగా అంతలోనే రైలు వేగం అందుకుంది.దీంతో వేగంగా వెళ్తున్న రైలు నుండి పడిపోయిన ఆ మహిళను కానిస్టేబుల్ కాపాడారు.

ఆ మహిళ రైలు దిగే సమయంలో తొందరలో ప్లాట్ ఫామ్ పై నుండి పట్టాలపైకి జారిపోతున్న మహిళను అక్కడే ఉన్న రైల్వే కానిస్టేబుల్ సతీష్ మహిళను చేపట్టి ప్లాట్ ఫామ్ పైకి లాగడంతో ఆవిడ ప్రాణాపాయం నుండి తప్పించుకుంది.అంతేకాదు ఆ తర్వాత ఆమె భర్తను కూడా రైల్వే కానిస్టేబుల్ ఈ ప్రమాదం నుండి తప్పించాడు.

ఈ సంఘటనకు సంబంధించి పూర్తి దృశ్యాలు రైల్వేస్టేషన్లోని సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో అవి కాస్తా వైరల్ గా మారాయి.ఇకపోతే సంఘటన నుంచి తేరుకున్న కుటుంబ సభ్యులను పోలీస్ వారు ప్రశ్నించగా స్వామివారి దర్శనార్థం వచ్చామని.

దాంతో స్వామివారి దర్శనం కోసం ఇచ్చిన సమయం దాటిపోతుందన్న కంగారు లోనే తాము ఇలా ప్రయత్నించామని చెప్పడంతో ఆ కుటుంబ సభ్యులను పోలీసులు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి పంపించేశారు.ఇద్దరి ప్రాణాలు కాపాడిన రైల్వే కానిస్టేబుల్ సతీష్ ను రైల్వే శాఖ అధికారులు ప్రశంసించారు.

#TirumalaExpress #Tarn #Accident #Tirupathi #Early Morning

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు