వైరల్ పోస్ట్ నాన్న నువ్వు త్వరగా తిరిగి వచ్చేయ్. అంటున్న డేవిడ్ వార్నర్ కూతురు..!

సన్‌ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఎన్నో ఏళ్ల నుంచి కీలక బ్యాట్స్‌మెన్, కెప్టెన్‌ గా సేవలు అందిస్తున్న డేవిడ్ వార్నర్‌ పై వేటు వేయడాన్ని ఎస్ఆర్‌హెచ్ అభిమానులే కాకుండా క్రికెట్ నిపుణులు కూడా జీర్ణించుకో లేకపోతున్నారు. సన్‌ రైజర్స్ జట్టు గెలిచిన ఏకైక ఐపీఎల్ టైటిల్ డేవిడ్ వార్నర్ కెప్టెన్సీ లోనే కావడం గమనార్హం.

 Viral Post Daddy Youll Be Back Soon Says David Warners Daughter-TeluguStop.com

ఈ సీజన్‌ లో జట్టుగా విఫలమైనా బ్యాట్స్‌మెన్‌ గా మాత్రం విఫలం కాలేదు. స్ట్రైక్ రేట్ తక్కువగా ఉన్నదనే సాకు చూపించినా చెన్నై లోని పిచ్‌ లు ఎలా ఉన్నాయో అందరూ చూశారు.

ఐపీఎల్‌ లో ఇంతవరకు టైటిల్ గెలవకుండా ప్రతీ ఏడాది పేలవ ప్రదర్శన చేస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం విరాట్ కోహ్లీని బాధ్యతల నుంచి తప్పించలేదు.

 Viral Post Daddy Youll Be Back Soon Says David Warners Daughter-వైరల్ పోస్ట్ నాన్న నువ్వు త్వరగా తిరిగి వచ్చేయ్ అంటున్న డేవిడ్ వార్నర్ కూతురు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

గత సీజన్‌ లో చెన్నై సూపర్ కింగ్స్ పూర్తిగా విఫలమైనా ఎంఎస్ ధోనీని కూడా తప్పించలేదు.

గత కొన్ని సీజన్లుగా వరుసగా ప్లే ఆఫ్స్‌ కు చేరుకుంటున్న జట్టు కెప్టెన్‌ ను కేవలం 6 మ్యాచ్‌ ల ప్రదర్శన చూసి వేటు వేయడం సబబు కాదని పలువురు అంటున్నారు.డేవిడ్ వార్నర్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విధ్వంసకరమైన బ్యాట్స్‌మెన్లలో ఒకడు.

ఈ ఐపిఎల్ లీగ్‌ లో 5 వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి విదేశీ బ్యాట్స్‌మాన్ కూడా డేవిడ్ వార్నరే.గతంలో ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌ గా నిలిచిన వార్నర్‌ ను బ్యాటింగ్ సరిగా లేదని పక్కన పెట్టడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒక క్రీడాకారుడి ఫామ్ ఒడిదుడుకులకు గురవ్వడం సహజమే.అది ఎవరిని అడిగినా చెబుతారు.అలాంటి సమయంలో అండగా ఉండాల్సిన యాజమాన్యం అతడిని పక్కన పెట్టేసి మరింతగా అవమానించిందని ఫ్యాన్స్ అంటున్నారు.టోర్నీ వాయిదా కంటే ముందు వార్నర్ను  కెప్టెన్సీ నుంచి తప్పించింది సన్​రైజర్స్ హైదరాబాద్.

అలాగే రాజస్థాన్ రాయల్స్​తో జరిగిన మ్యాచ్​ లో తుదిజట్టులో చోటు ఇవ్వలేదు.తర్వాత మ్యాచ్​ ల్లోనూ వార్నర్ ఆడేది అనుమానమే అని సన్​ రైజర్స్ కోచ్ ట్రెవర్ బెయిలిస్ తెలిపాడు.

దీనిపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్​ సీజన్​ అర్ధాంతరంగా వాయిదా పడిన సందర్భంగా సన్ ​రైజర్స్ హైదరాబాద్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ తన ఇన్​స్టా ఖాతాలో ఓ పోస్ట్ షేర్ చేశాడు.

అందులో ఉన్న ఫొటో నెటిజన్లను ఆకర్షిస్తోంది.అది వేసింది ఎవరో కాదు.

వార్నర్ కూతురు ఇవీ.ఈ ఫొటో కాస్త ప్రస్తుతం నెట్టింట వైరల్ ​గా మారింది.ఆ ఫొటోలో వార్నర్ కూతురు, ఆమెతో పాటు సోదరీమణులు, తండ్రి వార్నర్, తల్లి క్యాండిస్​ చిత్రాలను పేపర్ ​పై చిత్రీకరించింది.ఫొటో కింద ప్లీజ్ డాడీ ఇంటికి తొందరగా రండి.

మేము మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం.ప్రేమతో ఇవీ, ఇండి, ఇస్లా అని రాసుకొచ్చింది.

ప్రస్తుతం నెట్టింట ఈ ఫోటో హల్ చల్ చేస్తోంది.

#MS.Dhoni #Children #David Warner #Social Media #Ipl 2021

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు