వైరల్ పోస్ట్: కీరన్ పొల్లార్డ్ అదృశ్యమయ్యాడు అంటున్న బ్రావో..!

భారత్ – వెస్టిండీస్ ఆఖరి వన్డే నేడు అహ్మదాబాద్ లో జరగనుంది.ఇప్పటికే రెండు మ్యాచ్ లలో విజయం సాధించిన భారత్ ఈ సిరీస్ ను వైట్ వాష్ చేయాలన్న ఉద్దేశ్యంతో ఉంది.

 Viral Post Bravo Saying Kieran Pollard Has Disappeared , Kiran Polad , Viral L-TeluguStop.com

మూడో వన్డేలోనూ విజయం సాధించి వెస్టిండీస్ పై పూర్తి స్థాయి ఆధిపత్యం సాధించాలన్న పట్టుదలతో భారత్ ఉంది.ఇక రెండు వన్డేల్లోనూ పరాజయం పాలయి నిరాశతో ఉన్న వెస్టిండీస్ జట్టు ఈ చివరి వన్డేలోనైనా విజయం సాధించాలని చూస్తుంది.

ఈ జట్టులోనూ అనేక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి.

ఈ పరిస్థితుల మధ్య వెస్టిండీస్ క్రికెటర్ బ్రావో.

కీరన్ పొల్లార్డ్ అదృశ్యం అయ్యాడంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక పోస్ట్ వైరల్ గా మారింది.కీరన్ పొల్లార్డ్ అదృశ్యం అయ్యాడని, ఆచూకీ తెలిసిన వారు వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు సమాచారాన్ని ఇవ్వాలంటూ ఆయన పోస్ట్ లో విజ్ఞప్తి చేశాడు.

కీరన్ పొలార్డ్ వయస్సు, ఎత్తు లాంటి వ్యక్తిగత వివరాలను ఈ ఫొటోతో జతచేసాడు.చివరిసారిగా పోలార్డ్.

యజువేందర్ చాహల్ పాకెట్‌లో కనిపించాడని, ఆ తరువాత అదృశ్యం అయ్యాడని బ్రావో పేర్కొన్నాడు.అతని ఆచూకీ తెలిసిన వారు వెంటనే వెస్టిండీస్ క్రికెట్ బోర్డును సంప్రదించాలని, లేదా తనకు మెసేజ్ చేయాలని సూచించాడు.

భారత్‌తో జరిగిన మొదటి వన్డేలో కీరన్ పొలార్డ్.యజువేందర్ చాహల్ బౌలింగ్ లో డక్ అవుట్ అయి వెనుదిరిగాడు.తొలి బంతికే అవుట్ అయ్యి.ఇక గాయం కారణంగా రెండో వన్డేకు దూరం అయ్యి.డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితం అయ్యాడు.దీన్ని దృష్టిలో ఉంచుకుని డ్వేన్ బ్రావో సరదాగా ఈ పోస్ట్ చేశాడు.

ఇక ఆఖరి వన్డే మ్యాచ్ నేడు జరగనుంది.

Viral Post Bravo Saying Kieran Pollard Has Disappeared , Kiran Polad , Viral Latest , Viral News , Social Media , Missed , Bravo , Viral Post , West Indies , West Indies Cricketer Bravo , Post On Social Media - Telugu Bravo, Kiran Polad, Latest, Cricketer Bravo

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube