వైరల్: గంగా జలాన్ని తాగితే శానిటైజర్ తో పనిలేదంటున్న పోలీసులు..!

దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగిస్తూనే ఉంది.గత సంవత్సరం ఈ మహమ్మారి కారణంగా చాల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

 Viral Police Say That We Dont Need Sanitizer If We Drink Ganga Water , Carona Vi-TeluguStop.com

ఇక ఇప్పుడు కూడా రోజుకి 50 వేలకి పైగా కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయి.ఇక కరోనా వైరస్ బారినపడకుండా ఉండాలంటే ఆ రసం ఈ రసం తాగాలి అని చాల మంది చెబుతూ ఉండేవారు.

అంతేకాదు వారు చెప్పినవి తీసుకోవడం వలన వైరస్ మీ దరికి రాదు అంటూ కొందరు తప్పుడు ప్రచారం చేసి అనేక ఇబ్బందు పడ్డారు.ఇక ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లోని మీరట్ పోలీసులు వారికంటే మేము ఎందులో తక్కువ కాదు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు.

గంగాజలం బాటిళ్లను పోలీస్ స్టేషన్ లో పెట్టి స్టేషన్ కు వచ్చినోళ్లందరికీ ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.హోలీ రోజున మందు బాటిళ్లు గిఫ్ట్ గా ఇవ్వడం కంటే ఇలా గంగాజలాన్ని గిఫ్ట్ గా ఇవ్వండి అంటూ వారికి చెప్తున్నారు.

Telugu Carona Wave, Carona, Covid, Ganga Sanitizer, Gangan Jalam, Meerut, Saniti

హోలీ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ కి చెందిన ఒక పోలీస్ అధికారి ఫిర్యాదుదారులకు గంగా జలం సీసాలను పంపిణీ చేశారు.గంగా జలాన్ని చల్లుకొని కరోనా వంటి రోగాల నుంచి విముక్తి పొందాలని కోరారు.మీరట్ జిల్లాలోని నౌచండి పోలీస్ స్టేషన్ అధికారి ప్రేమ్ చంద్ శర్మ హోలీ నేపథ్యంలో వినూత్న నిర్ణయం తీసుకున్నారు.ఫిర్యాదు కోసం స్టేషన్ కు వచ్చే వారికి గంగా జలం సీసాలు బహుమతిగా ఇచ్చారు.

కరోనా నేపథ్యంలో హోలీ నాడు రంగు నీళ్లకు బదులు గంగాజలాన్ని చల్లుకోవాలని శర్మ సూచించారు.ఇది శానిటైజర్ గా పనిచేస్తుందని అనేక రోగాల నుంచి రక్షణ కల్పిస్తుందని చెప్పారు.

ఈ తరుణంలో హోలీ నాడు ఎవరికీ మద్యం సీసా ఇవ్వవద్దని దానికి బదులు గంగా జలం ఇవ్వాలని సూచించారు.గంగాజలం శానిటైజర్ అని దీన్ని చల్లుకోవడం వల్ల కరోనా వంటి రోగాల బారిన పడకుండా రక్షణ పొందవచ్చని వెల్లడించారు.

గంగాజలాన్ని ప్రమోట్ చేయడం వరకు ఓకే శానిటైజర్ బదులు దాన్ని వాడొచ్చు అని చెప్పడానికి వారేమైనా శాస్త్రవేత్తలా లేక వైద్య నిపుణులా ఇదే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube