వైరల్: మహిళా కానిస్టేబుల్ కు సీమంతం చేసిన పోలీసులు..?!

అమ్మతనంలోని తియ్యదనం అనుభవించాలని ప్రతి మహిళా కోరుకుంటుంది.కడుపుతో ఉన్న దగ్గర నుంచి బిడ్డను ప్రసవించే దాక ప్రతిరోజు అమ్మకి ఒక మధురానుభూతే కదా.

 Viral: Police Restrict Women Constable ..? Women Conistable, Viral Latest, Viral-TeluguStop.com

అలాగే స్త్రీ గర్భవతిగా ఉన్న సమయంలో శ్రీమంతం చేయడం అనేది ఎప్పటినుంచో మన సంప్రదాయలలో భాగంగా వస్తుంది.ఈ క్రమంలోనే ఒక కడుపుతో ఉన్న మహిళకు తన తోటి సిబ్బంది అంగరంగ వైభవంగా శ్రీమంతం వేడుక నిర్వహించారు.

ఇంతకీ ఎక్కడ అనుకుంటున్నారు పోలీస్ స్టేషన్లో.అవును, స్వయంగా పోలీసు సిబ్బందే వారి స్టేషన్లో పని చేసే మహిళా కానిస్టేబుల్ కు శ్రీమంతం చేసి నిండు మనసుతో తల్లిని బిడ్డని ఆశీర్వదించారు.

ఈ వేడుకకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అసలు వివరాల్లోకి వెళితే.

గురజాల టౌన్ పోలీస్ స్టేషన్‌ లో బంగారమ్మ అనే మహిళ గత 3 సంవత్సరములుగా పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తుంది.ఈ మూడు సంవత్సరాలలో ఎటువంటి రిమార్క్ లేకుండా, విధి నిర్వహణలో భాగంగా తన బాధ్యతను సక్రమంగా చేస్తూ వచ్చేది.

ఈ క్రమంలో బంగారమ్మ మొదటిసారిగా గర్భవతి అవ్వడంతో తమతో పాటు పనిచేసే మహిళా కానిస్టేబుల్‌ ను జీవితంలో మర్చిపోలేని విధంగా సన్మానించాలని పోలీసు సిబ్బంది అనుకున్నారు.అనుకున్నదే తడవుగా బంగారమ్మకి శ్రీమంతం ఏర్పాట్లు చేసేసారు.

Telugu Baby Shower, Latest, Conistable-Latest News - Telugu

గురజాల స్టేషన్ సిఐ సురేంద్ర బాబు దగ్గర ఉండి మరి సీమంతం వేడుకను జరిపించారు.అలాగే ఈ సీమంతం ఫంక్షన్ కు స్పెషల్ గెస్ట్ గా గురజాల డియస్పి మెహర్ జయరాం ప్రసాద్ పాల్గొన్నారు.బంగారమ్మకు అక్షింతలు వేసి ఆమెను నిండు మనసుతో ఆశీర్వదించారు.అలాగే ఈ వేడుకకు అతిధులుగా ఎస్ఐ నాగార్జున, ఎఎస్ఐ స్టాలిన్, గురజాల స్టేషన్ పోలీసులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా బంగారమ్మ ఆనందం వ్యక్తం చేస్తూ బహుశా ఇలాంటి సంబరం ఇప్పటిదాకా నాకు మాత్రమే జరిగి ఉండవచ్చు ఏమో అని అభిప్రాయపడ్డారు.ఇంతటి గౌరవం నాకు, నా బిడ్డకు దక్కడం నా పూర్వజన్మ సుకృతం అని సంతోషపడింది.

నాకు సీమంతం నిర్వహించి నన్ను ఆశీర్వదించిన ప్రతి ఒక్క సిబ్బందికి జీవితాంతం రుణపడి ఉంటానన్నారు బంగారమ్మ.పోలీసులు చేసిన ఈ పనిని నెటిజన్లు తెగ మెచ్చెకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube