వైరల్: అగ్ని పర్వతం పై తయారుచేసిన పిజ్జా.. ఎలా ఉందంటే..?!

పిజ్జా పేరు వింటేనే నోరూరిపోతుంది.పిజ్జాను సాధారణంగా ఓవెన్ లో తయారు చేస్తారనే విషయం తెలిసిందే.

 Viral: Pizza Made On The Volcano  How Come  Viral News, Viral Latest, Lava, Pizz-TeluguStop.com

కొంతమంది చేయితిరిగిన వారు గ్యాస్ స్టౌ మీద కూడా పిజ్జాను తయారు చేస్తారు.కానీ సెగలు కక్కే అగ్నిపర్వతం మీద పిజ్జా తయారు చేయడం మీరు ఎపుడైనా చూశారా.

కనీసం దాని గురించి విన్నారా దాని గురించి మీరు అసలు ఊహించి ఉండరు.కానీ డేవిడ్ గార్సియా అనే వ్యక్తి ఏకంగా అగ్నిపర్వతం లావా మీద పిజ్జాను తయారు చేశాడు.

ఆ పిజ్జా చాలా రుచిగా ఉందంటూ కావాలంటే మీరూ తినండి అంటూ చెబుతున్నాడు.

ప్రపంచంలో ఎంతో మంది ఎన్నో కొత్త ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

అందరిలో కొత్త కొత్త ఆలోచనలు పుడుతూనే ఉంటాయి.కొంతమంది వాటిని కార్యరూపం దాల్చేలా చేస్తారు.

అలా వచ్చిన ఐడియాతో 34 ఏళ్ల డేవిడ్ గార్సియా గ్వాటేమేలాలోని పకాయ అగ్ని పర్వతం లావా వేడి మీద పిజ్జాలను తయారు చేశాడు.తనకంటూ ఓ ప్రత్యేకతను సాధించాడు.

అగ్నిపర్వం మీద పిజ్జా కాల్చటం అంత ఈజీ కాదు.రిస్క్ తో కూడుకున్న పని అది.

Telugu Lava, Latest-Latest News - Telugu

సాధారణంగా ఎవరూ అటువంటి ఆలోచన చేయడానికే సాహసించరు.ఎంత వ్యాపారం కోసం అయితే, మాత్రం అంత రిస్క్ అవసరమా అని చాలా మంది అనుకోవచ్చు.కానీ కొత్తదనం కోరుకునేవారు ఎంత పెద్ద రిస్క్ అయినా చేస్తారు.అందుకే డేవిడ్ గార్సియా ఈ రిస్క్ చేశాడు.గ్వాటేమేలాలోని పకాయ అగ్ని పర్వతంపై డేవిడ్ గార్సియా పిజ్జాలు చేశాడు.వీటికి ‘‘పకయా పిజ్జాలు‘‘ అని నామకరణం చేశాడు.

ఈ పిజ్జాలను తయారు చేయడం కోసం డేవిడ్ 1,800 డిగ్రీల ఫారెన్‌ హీట్ వరకు ఉష్ణోగ్రతను తట్టుకునే ప్రత్యేక లోహపు పలకలు ఉపయోగించాడు.అలాగే వేడి నుంచి రక్షణనిచ్చే దుస్తులను ధరించాడు.

ఈ ఫోటోలను అతను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.అవి ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాయి.

గార్సియా అగ్నిపర్వతం మీద పిజ్జాలు చేస్తుంటే.పిజ్జాతో పోజులిస్తూ ఫోటో దిగడానికి అనేక మంది పర్యాటకులు అగ్నిపర్వత ప్రదేశానికి తరలివచ్చారు.

నేను ఈ పిజ్జను సుమారు 800 డిగ్రీల వేడి గుహలో పెట్టాను.అది 14 నిమిషాల్లో తయారైపోయింది అని చెప్పాడు.

ఈ పిజ్జా చాలా రుచిగా ఉంది అని పర్యాటకులు చెప్పారని, తన ప్రయత్నాన్ని ప్రశంసించారని గార్సియా తెలిపాడు.పకాయ అగ్నిపర్వతం ఫిబ్రవరి నుండి విస్ఫోటనం చెందుతోంది.

స్థానిక సంఘాలు, అధికారులను అప్రమత్తతో ఉన్నారు.ఈ అగ్నిపర్వత సముదాయం సుమారు 23,000 ఏళ్ల క్రితం విస్ఫోటనం చెందింది.

స్పానిష్ గ్వాటెమాల ఇప్పటివరకూ కనీసం 23 సార్లు విస్ఫోటనం చెందింది.అటువంటి ఈ పకాయ పర్వతంపై పిజ్జాను కాల్చి డేవిడ్ గార్సియా రికార్డు క్రియేట్ చేశాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube