వైరల్ పిక్: స్విమ్మింగ్ పూల్ లో సిమ్మింగ్ నేర్చుకుంటున్న ఆ చిన్నారి ఇప్పటి హీరోయిన్ ఎవరో గుర్తు పట్టగలరా..?!

సినిమాల్లో హీరో, హీరోయిన్ లను పిచ్చి పిచ్చిగా ఆరాధించే ఫాన్స్ కొందరు ఉంటారు.ఒక్కసారి హీరో గాని, హీరోయిన్ గాని నచ్చితే చాలు వారికి సంబందించిన ఫోటోలు, సమాచారం కోసం ఫుల్ గా గూగుల్ కు గాలెం వేస్తారు.

 Viral Pick: Can Anyone Remember The Child's Current Heroine Who Is Learning To S-TeluguStop.com

వారి కోసం సైట్లన్ని చదివేస్తుంటారు.వారికి సంబందించిన ఫొటోలు సంపాదించడానికి తెగ ఆరాట పడుతుంటారు.

అయితే ఫాన్స్ ఆసక్తిని అర్ధం చేసుకున్న యాక్టర్ లు కూడా తమ ఫోటోలను ఫాన్స్ కోసం షేర్ చేస్తుంటారు.అయితే ఇటీవల ఓ స్టార్ హీరోయిన్ షేర్ చేసిన ఓ ఫోటో విపరీతంగా నెట్టింట చెక్కర్లు కొడుతోంది.

నడక కూడా సరిగా రాని వయస్సులోనే ఈత కొడుతూ.ముద్దుముద్దుగా ఫోటోకి ఫోజిచ్చింది.

మరి ఆ చిన్నారి క్యూటీ ఎవరు అంటే ఇప్పటి ఓ స్టార్ హీరోయిన్.జిమ్ లో వర్క్ అవుట్ లు చేస్తూ.

ఫిట్ నెస్ కి ప్రాణమిచ్చే టాల్ బ్యూటీ.ఎవరో ఇప్పటికైనా గుర్తుపట్టారా.

అవును అండి ఆమె రకుల్ ప్రీత్ సింగ్.

Telugu Rakulpreethi, Pool, Latest-Latest News - Telugu

వెంకటాద్రి ఎక్సప్రెస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ ఢిల్లీ బ్యూటీ తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో తన యాక్టింగ్, అందం, ఫిట్ నెస్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది.వరుస ఆఫర్ లతో బిజీగా ఉంటూ జిమ్ లో కుస్తీ పడుతూ ఎప్పటికప్పుడు కొత్త ఫోటో లతో రిఫ్రెష్ చేస్తుంది రకుల్.చిన్నప్పటి నుండి వర్క్ అవుట్ లు చేయడం ఇష్టం అంటున్న ఈ బ్యూటీకి ఫిట్నెస్ అంటే ఎంత ఇష్టమో ఈ ఫోటో బట్టే అర్ధం అవుతుంది.

నడక కూడా రాని వయస్సులో తండ్రితో కలిసి ఈత కొడుతున్న ఈ ఫోటో చూస్తే ప్రతీ ఒక్కరూ ‘సూపర్’ అనాల్సిందే.ఈ ఫోటో లను రకుల్ షేర్ చేసిన కొద్దిసేపటికే తెగ వైరల్ అయ్యాయి.

తెలుగులో యువ అగ్ర కథానాయకులతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ పంజాబీ బ్యూటీ వరుస ఆఫర్ లతో బిజీగా ఉంటుంది.కేవలం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనే కాకుండా.

దక్షిణాది చిత్ర సినిమాలలో అలాగే బాలీవుడ్ లో కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తూ దూసుకెళ్తుంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube