వైర‌ల్ పిక్.. యాక్సిడెంట్ ఎంత ప్ర‌మాద‌క‌రంగా ఉంటుందో చెప్పే ఫొటో ఇది..

Viral Pic This Is A Photo That Tells How Dangerous An Accident Can Be

రోడ్డు ప్ర‌మాదం ఎప్పుడూ విషాదాన్నే మిగుల్చుతుంది.దాని ఫ‌లితం ఊహించ‌ని విధంగా ఉంటుంది.

 Viral Pic This Is A Photo That Tells How Dangerous An Accident Can Be-TeluguStop.com

అప్ప‌టి వ‌ర‌కు సంతోషంగా ఉన్న జీవితాల‌ను చిన్నాభిన్నం చేసేస్తుంది.జీవితానికి స‌రిప‌డా బాధ‌ను మిగుల్చుతుంది.

అందుకే రోడ్డు ప్ర‌మాదాల‌కు అత్యంత దూరంగా ఉండాలని ఎప్ప‌టి నుంచో అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు.మ‌రీ ముఖ్యంగా మ‌ద్యం తాగిన త‌ర్వాత వాహ‌నాల‌ను న‌డ‌పొద్ద‌ని, ప్ర‌మాదాల్లో ఎక్కువ‌గా కార‌ణాలు మ‌ద్యం తాగడం వ‌ల్ల‌నే అని తెలియ‌డంతో దీన్ని అవాయిడ్ చేయాలంటూ ఎప్ప‌టి నుంచో అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు పోలీసులు.

 Viral Pic This Is A Photo That Tells How Dangerous An Accident Can Be-వైర‌ల్ పిక్.. యాక్సిడెంట్ ఎంత ప్ర‌మాద‌క‌రంగా ఉంటుందో చెప్పే ఫొటో ఇది..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయినా స‌రే ఎవ‌రూ విన‌కుండా ఇలాగే మ‌ద్యం తాగుతూ కారు, బైకు న‌డుపుతున్నారు.చివ‌ర‌కు ప్రాణాల మీద‌కు తెచ్చుకుంటున్నారు.అయితే ఇప్పుడు కూడా ఓ ఫొటో నెట్టింట విప‌రీతంగా హ‌ల్ చ‌ల్ చేస్తోంది.అయితే అది అంత సంతోసించ‌ద‌గ్గ విష‌యానికి సంబంధించింది కాదు.

బాధ‌కు సంబంధించింది. ప్ర‌మాద తీవ్ర‌త ఎంత‌లా ఉంటుందో చెప్పే ఫొటో ఇది.వివ‌రాల ప్ర‌క‌రాం.పంజాబ్ రాష్ట్రంలోని మోహాలీ ప్రాంతానికి చెందిన కొంద‌రు యువ‌కులు మ‌ద్యం తాగుతూ ఘరువాన్‌లోని చండీగఢ్ యూనివ‌ర్సిటీ వైపు వ‌స్తున్నారు.

Telugu Auto, Car, Mohali, Road, Terriable-Latest News - Telugu

అయితే కారు అత్యంత వేగంతో ఉండ‌టంతో వారి కారు రెండు ఆటోల‌ను ఢీ కొట్టింది.ఈ ఘ‌ట‌న‌లో ఇద్దరు ఆటో డ్రైవర్లతో క‌లిపి మొత్తం ముగ్గురు అక్క‌డిక‌క్క‌డే మరణించారు.అయితే కారు మాత్రం తుక్కు తుక్కు అయిపోయింది.ఏ మాత్రం ఆన‌వాళ్లు తెలియ‌కుండా మారిపోయింది.యువ‌కులు స్పీడుగా వ‌స్తూ ముందుగా డివైడ‌ర్ ను ఆ త‌ర్వాత ఆటోల‌ను ఢీకొట్టారు.ఇలా ముగ్గురి ప్రాణాలు తీసేశారు.

ఈ ఘ‌ట‌న‌లో కారు నాలుగు ప‌ల్టీలు కూడా కొట్టింది.కారులో ఉన్న వారు తీవ్రంగా గాయపడ్డారు.

దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు అంద‌రినీ క‌లిచి వేస్తున్నాయి.దీన్ని చూసిన వారంతా కూడా ఇలాంటి ప్ర‌మాదాలు జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త‌గా ఉండండి అంటూ సూచ‌న‌లు చేస్తున్నారు.

#Road #Car #Terriable #Auto #Mohali

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube