వైర‌ల్ పిక్‌.. యుద్ధం ప్ర‌తిఫ‌లం ఎలా ఉంటుందో చెప్పే ఫొటో ఇది..

ఒక యుద్ధం ఎన్నో కుటుంబాల‌ను ఛిన్నాభిన్నం చేసేస్తుంది.ఈ విష‌యం అంద‌రికీ తెల‌సిందే.

 Viral Pic This Is A Photo That Shows The Outcome Of The War, Viral Pic, Siria, M-TeluguStop.com

ఎవ‌రికి ఎలాంటి లాభం చేకూర్చుతుందో తెలీదు గానీ దాని ప్ర‌తిఫ‌లం మాత్రం అందులో పాల్గొన్న వారి జీవితాల‌ను అక్క‌డున్న వారి జీవితాల‌ను మాత్రం స‌ర్వ నాశనం చేసేస్తుంది.ఇప్ప‌టికే ఎన్నో ఘ‌ట‌న‌లు ఇంకా మాన‌ని గాయాలు అలాగే మండుతూనే ఉన్నాయి.

ప్ర‌పంచ వ్యాప్తంగా ఎన్నో యుద్ధాలు ఇంకా అక్క‌డి ప్ర‌జ‌ల‌కు పీడ క‌ల‌లుగానే మిగిలిపోయాయి.అలాంటి యుద్ధ‌మే ఇప్పుడు సిరియా దేశంలో జ‌రుగుతోంది.

ఈ దేశ ప్ర‌జ‌ల జీవితాలు ఎప్పుడు ఎలాంటి ప్ర‌మాదంలో ప‌డుతాయో ఎవ్వ‌రికీ తెలియ‌దు.ప్రాణాల‌ను అర‌చేతిలో ప‌ట్టుకుని బ్ర‌తుకుతున్నారు ఇక్క‌డి ప్ర‌జ‌లు.ఇప్ప‌టికే సిరియా ప్ర‌జ‌ల దీన గాథ‌ల‌కు సంబంధించిన ఎన్నో ఫొటోలు, వీడియోలు ఎంత‌లా క‌న్నీరు తెప్పించాయో మ‌నం చూశాం.ఈ దేశం నుంచి చాలామంది విదేశాల‌కు వ‌ల‌స వెళ్లే క్ర‌మంలో ప్రాణాలు విడుస్తూనే ఉన్నారు.

కాగా ఇప్పుడు కూడా ఒక‌టి విప‌రీతంగా ప్ర‌పంచాన్ని ప్ర‌శ్నిస్తోంది.మాటల్లో చెప్ప లేని గాయాన్ని ఈ ఫోటో ఒక్కటి మ‌నంద‌రికీ చెప్పేస్తుంది.

ఈ ఫొటో ఒక్క‌టి ఎన్నో ఆలోచ‌న‌ల‌ను క‌లిగిస్తోంది.ప్రపంచానికి త‌మ జీవితాల గురించి తెలియ‌జేస్తోంది.

Telugu Born Limbs, Child Limbs, Manzeer, Nerve Gas, Siria, Syria, Syria War, War

దీన్ని చూస్తేనే క‌న్నీళ్లు రాక‌మావేమో.నిత్యం సిరియాలో యుద్ధ వాతావ‌ర‌ణం ఉండ‌టం వ‌ల్ల అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు.అయితే మున్జీర్ అనే వ్య‌క్తి బాంబుదాడిలో తన కాలును పోగొట్టుకున్నాడు.అప్ప‌టి నుంచి అత‌ను ఊత కర్ర సాయంతో జీవిస్తున్నాడు.కాగా యుద్ధ వాతావ‌ర‌ణంలో వెలువడిన నెర్వ్ గ్యాస్ ను పీల్చటం వ‌ల్ల ఆయ‌న భార్య కూడా అనారోగ్యానికి గురైంది.ఈ క్ర‌మంలోనే ఆమె ఓ కాళ్లు, చేతులు లేని కొడుక్కి జన్మనిచ్చింది.

అయితే మున్జీర్ త‌న కొడుకును ఆడిస్తున్న ఫొటో ఇప్పుడు నెట్టింట క‌న్నీళ్లు తెప్పిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube