వైర‌ల్ పిక్‌.. ట్రాక్ట‌ర్ కింద ప‌డ్డా హెల్మెట్ అత‌డి ప్రాణాలు కాపాడింది..

కొన్ని ప్ర‌మాదాల‌ను చూస్తేనే వ‌ణుకు పుడుతుంది.ఇలాంటి భ‌యంక‌ర‌మైన ప్ర‌మాదాల్లో కొంద‌రు ప్రాణాలు కూడా కోల్పోతుంటారు.

 Viral Pic The Helmet That Fell Under The Tractor Saved His Life-TeluguStop.com

ఇంకొంద‌రు కాళ్లు, చేతులు విర‌గ్గొట్టుకుంటారు.అయితే కొన్ని ప్ర‌మాదాల్లో మాత్రం ఎంత పెద్ద‌గా జ‌రిగినా కూడా ఎలాంటి ప్రాణ‌హాని కాకుండానే సేఫ్‌గా బ‌య‌ట‌ప‌డుతుంటారు.

ఇక ఇప్పుడు కూడా ఇలాంటి ప్ర‌మాదం గురించే మ‌నం మాట్లాడుకోబోయేది.సాధార‌ణంగా యాక్సిడెంట్ల‌ను దృష్టిలో పెట్టుకునే హెల్మెట్ పెట్టుకోవాలంటూ చెబుతుంటారు.

 Viral Pic The Helmet That Fell Under The Tractor Saved His Life-వైర‌ల్ పిక్‌.. ట్రాక్ట‌ర్ కింద ప‌డ్డా హెల్మెట్ అత‌డి ప్రాణాలు కాపాడింది..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇలా హెల్మెట్ పెట్టుకుంటే ఎలాంటి హాని జ‌ర‌గ‌ద‌ని తెలుసు.

కానీ ఇలా ప్రభుత్వాలు, పోలీసులు ఎంతగా చెప్పినా కూడా విప‌రీత బుద్ధి వినాశ‌కాలం అన్న‌ట్టు చాలామంది మాత్రం పెడచెవిన పెడుతూ చివ‌ర‌కు ప్రాణాల మీద‌కు తెచ్చుకుంటున్నారు.

ఇక పోతే చాలా వ‌ర‌కు ప్రమాదాల్లో హెల్మెట్ ఉండి ఎంతోమంది ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డుతున్నారు.ఇలాంటి వీడియోలు కూడా మ‌నం ఎన్నో చూశాం.కాగా ఇప్పుడు మనకు ఇక్క‌డ క‌నిపిస్తున్న ఫొటోలోని యాక్సిడెంట్ గుజరాత్‌లోని దహోద్ ప‌ట్ట‌ణంలో జరిగిన‌ట్టు తెలుస్తోంది.ఈ ప్ర‌మాదంలో బైక్ న‌డుపుతున్న వ్య‌క్తి వెన‌కాల మహిళతో పాటు వారి బిడ్డ కూడా ఉంది.

Telugu Dahodh Area, Dashed Tractor, Gujarat, Helmet, Helmet Saved The Life, Man Driving Bike, Social Media, Viral Accident, Viral Pic-Latest News - Telugu

ఇక వారు ముందు ఉన్న గుంత‌ను త‌ప్పించేందుకు కొద్దిగా కుడివైపుకు బైకు పోనిచ్చాడు.కానీ ఎదురుగా వ‌స్తున్న ట్రాక్ట‌ర్‌ను ఆయ‌న స‌రిగ్గా గ‌మ‌నించ‌కోవ‌డంతో స‌రిగ్గా ట్రాక్ట‌ర్ ట్రాలీ కిందకు పడిపోయాడు.ఇక ట్రాలీ టైర్ బైక్ న‌డుపుతున్న వ్య‌క్తి తలపై నుంచి వెళ్లడంతో అంతా ఆయ‌న చ‌నిపోయాడ‌ని అనుకున్నారు.అయితే ఆయ‌న హెల్మెట్ పెట్టుకోవ‌డంతో ప్రాణాల‌తో బ‌య‌ట ప‌డ్డాడు.

లేక‌పోతే మాత్రం పెద్ద ప్ర‌మాదం జ‌రిగి ఉండేది.కాగా ఈ ప్ర‌మాదం మొత్తం సీసీ కెమెరాలో రికార్డయింది.

అయితే ఇక్క‌డ బైక్ కింద ప‌డుతున్న స‌మ‌యంలో ఆ మహిళ తన కొడుకును ప‌ట్టుకుని ఇవ‌త‌లి వైపు కు ప‌డిపోవ‌డంతో వారికి ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌లేదు.

#Helmet Saved #Dashed #Pic #Helmet #Bike

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు