సురేఖావాణి సీక్రెట్ గా రెండో పెళ్లి.. ఒక్క మాట చెప్పకుండా అలా లీక్?

Viral Pic Once Again Surekha Vani Second Marriage Issue Hot Topic

తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి సురేఖ వాణి ఒకరు.ఈమె ఎన్నో సినిమాలలో అద్భుతమైన పాత్రలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

 Viral Pic Once Again Surekha Vani Second Marriage Issue Hot Topic-TeluguStop.com

ఎక్కువగా అక్క, వదిన పాత్రలో నటిస్తూ విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్న సురేఖవాణి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు.సోషల్ మీడియా వేదికగా తన కూతురు సుప్రీతతో కలిసి ఈమె చేసే రచ్చ మామూలుగా ఉండదు.

సోషల్ మీడియా వేదికగా వీరు షేర్ చేసే వీడియోలు, ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ గా మారుతుంటాయి.

 Viral Pic Once Again Surekha Vani Second Marriage Issue Hot Topic-సురేఖావాణి సీక్రెట్ గా రెండో పెళ్లి.. ఒక్క మాట చెప్పకుండా అలా లీక్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక సురేఖ వాణి ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

అయితే అనారోగ్య సమస్య కారణంగా సురేఖ వాణి భర్త మృతి చెందడంతో ఆమె ఒంటరిగా తన కూతురుతో కలిసి ఉంటుంది.సింగర్ సునీత రెండో వివాహం చేసుకున్న తర్వాత సురేఖ వాణి కూడా రెండవ పెళ్లి చేసుకుంటుంది అంటూ తన పెళ్లి గురించి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

అయితే ఈ వార్తలపై సురేఖవాణి ఖండిస్తూ తాను రెండో పెళ్లి చేసుకోవడం లేదంటూ తేల్చి చెప్పారు.

Telugu Character Artist, Second Marriage, Social Media, Supritha, Surekha Vani, Tollywood-Movie

తాజాగా సోషల్ మీడియా వేదికగా సురేఖవాణి షేర్ చేస్తే ఫోటో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.ఈ క్రమంలోనే సురేఖవాణి షేర్ చేసిన ఫోటోలో ఆమె మంగళసూత్రం వేసుకోవడంతో ఈ ఫోటో కాస్త వైరల్ గా మారింది.సాధారణంగా పెళ్లి జరిగి భర్త ఉన్నవారు మాత్రమే మెడలో మంగళసూత్రం వేసుకుంటారు.

మరి భర్త చనిపోయిన సురేఖవాణి మంగళసూత్రం వేసుకోవడంతో ఈమె ఎవరికీ చెప్పకుండా రెండవ పెళ్లి చేసుకొని ఈ ఫోటో ద్వారా తన పెళ్ళి విషయాన్ని బయట పెట్టిందా.అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఆమె నిజంగానే పెళ్లి చేసుకుందా.లేకపోతే ఏదైనా సినిమా షూటింగ్లో భాగంగా అలా మెడలో మంగళసూత్రం వేసుకుందా అనే విషయం తెలియాల్సి ఉంది.

#Surekha Vani #Supritha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube