వైరల్‌ : వామ్మో ఇది ఉడతేనా? ప్రపంచంలోనే అత్యంత చిత్రమైన ఉడత  

Viral Pic Of Squirrel Biting Snake Goes Viral In Social Media-telugu Viral News,viral In Social Media,viral Pic,ఉడత,ప్రపంచంలోనే అత్యంత చిత్రమైన ఉడత

సిటీ వారికి పెద్దగా తెలియకున్నా పల్లెటూరు వారికి చాలా సుపరిచితం ఉడత. పల్లెల్లో ఎక్కువగా కనిపించే ఉడతలు చిన్న అలికిడి వినిపించినా కూడా అక్కడ కనిపించకుండా ఉడాయిస్తుంది. అడత చాలా భయం కలిగిన జంతువుగా మనం చెప్పుకోవచ్చు..

వైరల్‌ : వామ్మో ఇది ఉడతేనా? ప్రపంచంలోనే అత్యంత చిత్రమైన ఉడత-Viral Pic Of Squirrel Biting Snake Goes Viral In Social Media

ఎలాంటి వ్యక్తులు లేదా ఇతర జంతువులు కనిపించినా కూడా వెంటనే అది తన స్థావరంలోకి వెళ్లి తల దాచుకుంటుంది. అయితే ఉడతను ముంగిస జాతికి చెందినదిగా చెబుతూ ఉంటారు. ముంగీస పెద్ద పెద్ద పాములను సైతం మట్టి కరిపిస్తుంది.

కాని ఉడత మాత్రం పాములకు ఆమడ దూరంలో ఉంటాయి.

అన్ని ఉడతలు వేరు, ఈ ఉడత వేరు అన్నట్లుగా తాజాగా ఇప్పుడు మేము చెప్పబోతున్న ఉడత ఉంది. ఇది చాలా ప్రత్యేకమైన ఉడతగా పేరు దక్కించుకుంది. ఎందుకంటే ఈ ఉడత ఏకంగా పామునే చంపేసింది.

చంపేయడమే కాకుండా అయిదు అడుగుల పామును రెండడుగుల తోక వదిలేసి మొత్తం తినేసింది. ఒక ఉడత ఆకులు, కాయలు తినడం మనం చూశాం. కాని ఈ ఉడత మాత్రం ఏకంగా పామును తినడం అత్యంత చిత్రమైన విషయంగా నమోదు అయ్యింది..

ప్రపంచంలోనే ఇలాంటి సంఘటన వెలుగులోకి రావడం మొదటి సారి.

గతంలో ఉడతలు పామును తిని ఉండవచ్చు గాక, కాని ఈసారి మాత్రం అత్యంత ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ఉడత పామును తింటున్న సమయంలో వీడియో రికార్డ్‌ అయ్యింది. గతంలో ఉడతలు పాములను తినడం జరిగిందో లేదో తెలియదు.

కాని ఈసారి మాత్రం వీడియోతో సహా సాక్ష్యం ఉంది. దాంతో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ వీడియో వైరల్‌ అవుతోంది. అమెరికాలోని టెక్సాస్‌లో ఉండే గ్వాడలుపే మౌంటేన్స్‌ నేషనల్‌ పార్క్‌లో ఈ సంఘటన జరిగింది..

అత్యంత విచిత్రమైన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.