వైర‌ల్ పిక్‌.. జింక పిల్ల‌ను పెంచుతున్న చిరుత పులులు..

సోష‌ల్ మీడియా అంటేనే వైర‌ల్ వీడియోల‌కు, ఫొటోల‌కు పెట్టింది పేరు.అలాంటిది జంతువుల‌కు సంబంధించిన ఏవైనా వైర‌ల్ న్యూస్ ఉంటే ఇంకెంత‌లా ట్రెండ్ అవుతాయో తెలిసిందే.

 Viral Pic Leopards Raising Deer Cubs-TeluguStop.com

అయితే ఇందులో అమ్మ ప్రేమ‌కు సంబంధించిన వార్త‌లకు అయితే ఎంత‌లా ప్రాముఖ్యత ఉంటుందో తెలిసిందే.అమ్మ ప్రేమ విష‌యానికి వ‌స్తే మాత్రం ఏం చేసినా ఎంత చెప్పినా త‌క్కువే క‌దా.

ఈ విష‌యంలో జంతువుల‌క‌యినా మ‌నుషుల‌కైనా ఒక‌టే ఎమోషన్ ఉంటుందేమో.అందుకే త‌ల్లి ప్రేమ‌లో ఏ మాత్రం కూడా తేడా ఉండ‌కుండా జంతువులు చూపిస్తుంటాయి.

ఇక అమ్మప్రేమ జాతి వైరాన్ని తొల‌గిస్తుంద‌నే ఘ‌ట‌న‌లు ఇప్ప‌టికే అనేకం విన్నాం.బిడ్డల కోసం త‌ల్లి ప‌డే ఆరాటం, క‌ష్టం అంతా ఇంతా కాదు క‌దా.అందుకే త‌ల్లి ప్రేమ ముందు ఎంత‌టి రాజైనా చిన్న వాడ‌యిపోతాడు.అయితే ఇప్పుడు సృష్టిలోనే విరుద్ధ‌మైన జంతువులుగా పేరు తెచ్చుకున్న జింక‌, పులికి సంబంధించిన వార్త ఇప్పుడు వైర‌ల్ గా మారిపోయిదంఇ.

సాధార‌ణంగా జింక‌ను చూస్తూనే ఎప్పుడెప్పుడు తిందామా అన్న‌ట్టు పులులు చూస్తాయి.అలాంటిది ఇక్కడ మాత్రం కొన్ని చిరుత పులులు లేడి పిల్లను పెంచుతున్నాయి.

జింక పిల్ల‌కు ఆ చిరుత పులులే అమ్మగా మారి మ‌రీ దాని ఆల‌నా పాల‌నా చూస్తున్నాయి.ఆకలి కూడా తీరుస్తున్నాయి.అంతే కాదు ఎలాంటి జంతువులు దాన్ని తిన‌కుండా అవే స్వ‌యంగా రక్షణ ఇస్తున్నాయి.వాస్త‌వానికి ఈ జింక పిల్ల త‌ల్లిని గ‌తంలో కొన్ని చిరుత పులులు వేటాడి తినేశాయి.

ఆ స‌మ‌యంలోనే దాని క‌డుపు నుంచి ఈ జింక పిల్ల బ‌య‌ట ప‌డింది.ఇక ఆ చిన్న జింక పిల్ల‌ను చూసిన చిరుతులుకు పాపం అనిపించిందో ఏమో తెలియ‌దు గానీ అప్ప‌టి నుంచి ఆ జింక పిల్ల‌నుచిరుతలు చేరదీస్తున్నాయంట‌.

ఇందుకు సంబంధించిన ఫొటోను నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

#Pic #Animals #Deer Cub #Leopard

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube