వైరల్ పిక్: వర్షంలో తడవకుండా కుక్కలకి ట్రాఫిక్ పోలీస్ ఏం చేశాడంటే..?!

మనిషికన్నే కుక్కలే విశ్వాసంగా ఉంటాయని అందరికి తెలిసిన విషయమే.కాబట్టే ఇంట్లో కుక్కలను పెంచుకోవడం చాలా మందికి సరదా.

 Viral Pic Kolkata Traffic Police Humanity Towards Dogs In The Rain, Viral Latest-TeluguStop.com

కొంతమందైతే కుక్కలే ప్రపంచంగా బతుకుతూ ఉంటారు.కుక్కలు వాసనలు త్వరగా పసిగట్టగలవు కాబట్టే పోలీసులు కూడా తమకు విధుల్లో సహకరిస్తాయని పెంచుతారు.

ఇందుకోసం వాటికి ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తారు.మనుషులు చేయలేని పనులు కూడా కుక్కలు చేయగలవు.

కొన్ని సందర్భాల్లో యజమానిని కాపాడేందుకు కుక్కలు తమ ప్రాణాలను సైతం పణంగా కపడుతాయి.అందుకే కుక్కలంటే కొంత మందికి ప్రేమ, అభిమానం.

అందుకోసం ఏమైనా చేస్తారు.

అలాంటి కోవలోకి చెందిన ఒక వ్యక్తి కొద్దీ రోజుల క్రితం తన పెంపుడు కుక్క మీద ప్రేమతో తనతో పాటు ఆ కుక్క కూడా ప్రయాణించాలని ఏకంగా బిజినెస్ క్లాస్ మొత్తాన్ని బుక్ చేసాడట.వాళ్లిద్దరూ ఎయిర్ ఇండియా విమానంలో ముంబై నుంచి చెన్నై వచ్చేందుకు ఆ వ్యక్తి 2.25 లక్షలు ఖర్చుపెట్టాడంట.దీన్ని బట్టే తెలుస్తుంది ఆ కుక్క మీదో ఎంత ప్రేమ ఉందో.

అలాగే తాజగా ఇంకో సంఘటన జరిగింది.

ట్రాఫిక్ పోలీస్ తను విధులు నిర్వహిస్తుండగా వర్షం పడింది.వర్షంలో తడుస్తున్న రెండు కుక్కలను తాను వేసుకున్న గొడుగు కిందకు చేర్చి వాటిని తడవనివ్వకుండా చేస్తున్నాడు.

ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక ఫోటోను కోల్కతా పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్తా వైరల్ గా మారింది.దీంతో పాటు ఆ ఫోటోకి ‘ మొమెంట్ ఆఫ్ ద డే’ అని కాప్షన్ జత చేసి, ఈస్ట్ ట్రాఫిక్ గార్డ్ కానిస్టేబుల్ తరుణ్ కుమార్ అని ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి గురించి తెలుపుతూ పోస్ట్ చేసారు.ఇంతకీ ఇందులో ప్రత్యేకత ఏముందో అనుకుంటున్నారా.? అంత వర్షంలో కూడా ఆ పోలీస్ ట్రాఫిక్ ను నియంత్రిస్తూ విధుల్లో ఉన్నా కూడా రెండు కుక్కలను తడవనివ్వకుండా చేస్తున్నాడంటే కుక్కలపై తనకున్న ప్రేమ, అభిమానం, బాధ్యత కనిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube