వైర‌ల్ పిక్‌.. ఇంత పెద్ద సాలీడును మీరెప్పుడైనా చూశారా..?

Viral Pic Have You Ever Seen Such A Big Spider

కొన్ని ఫొటోలు మ‌న కండ్ల‌ను కూడా న‌మ్మ‌లేనంత విచిత్రంగా ఉంటాయి.ఇలాంటివి కూడా ఉంటాయా అని మ‌నం వాటిని చూసిన త‌ర్వాత ఆశ్చ‌ర్య‌పోక మాన‌మేమో.

 Viral Pic Have You Ever Seen Such A Big Spider-TeluguStop.com

అలాంటి ఫొటోల‌కు సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా ఆధ‌ర‌ణ ఉంటుంది.కొంద‌రు అయితే ఇలాంటి ఫొటోల‌తోనే ప్ర‌పంచ రికార్డులు కూడా క్రియేట్ చేయ‌డాన్ని మ‌నం చూస్తూనే ఉన్నాం.

ఇక పోతే ఇప్పుడు కూడా ఓ వ్య‌క్తి ఓ ఫొటోతోనే ప్ర‌పంచ రికార్డు నెల‌కొల్పాడు.ఆయ‌న తీసిన ఫొటో చూస్తే అంద‌రూ షాక్ అయిపోవాల్సిందే.

 Viral Pic Have You Ever Seen Such A Big Spider-వైర‌ల్ పిక్‌.. ఇంత పెద్ద సాలీడును మీరెప్పుడైనా చూశారా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆయ‌న త‌న మంచం కింద‌నే ఆ పెద్ద సాలెపురుగును చూసి షాక్ అయిపోయాడంట‌.

పెద్ద సాలె పురుగు ఆ మంచం కింద విప‌రీతంగా పిల్ల‌ల్ని క‌ని హాయిగా సంసారం పెట్టింది.

ఇంకేముంది అత‌గాడు కాస్తా దాన్ని ఫొటో తీసి షేర్ చేయ‌గా ఏకంగా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎగ‌రేసుకుపోయాడు.ఆయ‌న తీసిన ఫొటోకు ఈ అరుదైన గౌర‌వం ద‌క్కింద‌న్న‌మాట‌.

వివ‌రాల్లోకి వెళ్తే బ్రెజిల్ దేశానికి చెందిన ఫోటోగ్రాఫర్ గిల్ విజెన్ ఈ అరుదైన రికార్డును నెల‌కొల్పాడు.ఆయ‌న‌కు ఓ రోజు అనుకోకుండా త‌న బెడ్ రూమ్ లో చిన్న చిన్న సాలెపురుగులు విప‌రీతంగా ఉన్నాయ‌ని గుర్తించారు.

ఏంటా అని ఒక్క‌సారి మంచం కింద‌కు చూశాడు.

అక్క‌డ క‌నిపించిన దాన్ని చూసి షాక్ అయిపోయాడు.

త‌న మంచం కింద వంద‌ల సంఖ్య‌లో చిన్న సాలె పురుగుల‌ను ఉండ‌టంతో పాటుగా వాటి ప‌క్క‌నే త‌న అర చేతు అంత పెద్ద‌గా ఉన్న ఓ సాలెపురుగును కూడా గుర్తించాడు.అది ఈ ప్ర‌పంచంలోనే అత్యంత విష‌పూరిత‌మైన‌దిగా ఆయ‌న తెలుసుకున్నాడు.

అది గ‌న‌క కుడితే ప్రాణాలు విడ‌వ‌డ‌మే త‌రువాయి అంట‌.వంద‌ల సంఖ్య‌లో అది పిల్ల‌ల్ని పెట్టి వాటి ప‌క్క‌నే హాయిగా రెస్ట్ తీసుకుంటోంది.

ఇంకేముంది ఆయ‌న దాన్ని కాస్తా క్లిక్ మ‌నిపించేశాడు.ఈ ఫొటో కాస్తా ఇప్పుడు నెట్టింట విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.

.

#Big Spider #Big Spider

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube