వైర‌ల్ పిక్స్‌.. బాహుబ‌లి సింహాస‌నం మీద ఊరేగిన వ‌రుడు..

రాను రాను పెండ్లి వేడుక‌ల్లో అనేక మార్పులు వ‌స్తున్నాయి.ఇంత‌కు ముందు లాగా కాకుండా ఏదో ఒక స్పెష‌ల్ ఉండే విధంగా చూసుకుంటున్నారు క‌పుల్స్‌.

 Viral Pic Groom Marching On The Bahubali Throne Details, Viral Pic, Bahubali Mar-TeluguStop.com

ఇందులో భాగంగా పెండ్లి వేడుక‌ల్లో అనేక మార్పులు చేసుకుంటున్నారు.రోటీన్ గా ఉంటే కిక్ ఏముంది అని వెరైటీగా ప్లాన్ చేసుకుంటున్నారు.

ఇక ఈ మ‌ధ్య పెండ్లిల‌కు సంబంధించిన ఏదో ఒక వీడియో నెట్టింట్లో విప‌రీతంగా వైర‌ల్ అవుతూనే ఉన్నాయి.మొన్న‌టికి మొన్న డ్యాన్స్ వీడియోలు నెట్టింట్లో బాగా సంద‌డి చేశాయి.

వ‌ధూ వ‌రులు లేదంటే పెండ్లికి వ‌చ్చిన అతిథులు డ్యాన్స్ చేయ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.

అయితే వీటిలో సాగే ఇంకొన్ని వేడుక‌ల్లో ఏదో ఒక వెరైటీని ప్లాన్ చేసుకుంటున్నారు చాలామంది.

ఇప్పుడు కూడా ఓ వ్య‌క్తి ఇలాగే త‌న పెండ్లిలో చాలా వెరైటీ గా ఉండాల‌ని అనుకున్నాడు కాబోలు.అందుకే బాహుబ‌లి సినిమాలోని భ‌ళ్లాల‌దేవుని సింహాస‌నాన్ని ఊరేగింపుకు తెచ్చుకున్నాడు.

నిజానికి ఊరేగింపు అంటే పూర్వ కాలం వీరే పెండ్లి కొడుకు, కూతురు అని తెలియ‌జేయ‌డానికి దీన్ని నిర్వ‌హించారు.ఇదే రాను రాను మ‌రిన్ని మార్పుల‌తో స‌రికొత్త‌గా అయిపోయింది.

ఇప్పుడు ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పోలసానిపల్లిలో ఇలాంటి ఘ‌ట‌నే జ‌రిగింది.

Telugu Bahubali Groom, Bahubali, Groom-Latest News - Telugu

ఈ ఊరులో పెళ్లి చేసుకుంటున్న ఫణి ద్వారకాతిరుమలలో పెండ్లి వేడుక‌ల‌ను చేసుకుంటున్నాడు.అయితే అత‌ని ఊరేగింపులో కూడా కేరళ సంప్రదాయం ఉట్టి ప‌డే విధంగా సంప్ర‌దాయ వాయిద్యాలను అరేంజ్ చేసుకున్నాడు.అయితే ఇలా అన్ని రోటీన్ గా చేస్తే కిక్ ఏముంటుంది అనుకున్నాడో ఏమో గానీ వెంట‌నే బాహుబ‌లిలోని భ‌ళ్లాల దేవుని సింహాస‌నాన్ని తెప్పించుకున్నాడు.

దాని మీద ఊరేగింపుకు రెడీ అయిపోయాడు.రోడ్డు మీద ఫణి ఊరేగింపు గా వెళుతుంటే అంతా షాక్ అయిపోతున్నారు.ఇందుకు సంబందించిన ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube