వైర‌ల్ పిక్‌.. 2క్వింటాళ్ల డార్క్ చాక్లెట్‌తో చేసిన వినాయ‌కుడు

దేశ‌వ్యాప్తంగా వినాయ‌క చ‌వితి వేడుక‌లు ప్రారంభ‌మ‌య్యాయి.నేటి నుంచి తొమ్మ‌ది రోజుల పాటు గ‌ణ‌నాధుడిని భ‌క్తులు పూజించ‌నున్నారు.

 Viral Pic Ganesha Made With 2 Quintals Of Dark Chocolate, Viral Pic, Vinayaka Id-TeluguStop.com

చిన్నా పెద్దా తేడాల లేకుండా ప్ర‌తి ఒక్క‌రూ ఈ ఉత్స‌వాల‌లో పాల్గొంటారు.ఢిల్లీ నుంచి గల్లీ వ‌ర‌కు ఎక్క‌డ చూసినా పెద్ద‌పెద్ద వినాయ‌క విగ్ర‌హాలు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి.

కొంత మంది భ‌క్తులు విభిన్నంగా ఇత‌ర ఆహార ప‌దార్థాల‌తో వినాయ‌కుల‌ను త‌యారు చేస్తారు.ఈ విగ్ర‌హాలు చూడ‌ముచ్చ‌ట‌గా, ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తాయి.

కానీ స‌రికొత్త‌గా ఉండాల‌ని ఒ భ‌క్తుడు డార్క్ చాకెట్‌తో త‌యారు చేసిన వినాయ‌క విగ్ర‌హం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.ఆస‌లు ఆ వినాయ‌క విగ్ర‌హాన్ని ఎవ‌రూ త‌యారు చేశారో తెలుసుకుద్దాం.

పంజాబ్‌లోని లూథియానా ప‌ట్ట‌ణంలోని ఒక బేక‌రీలో చాక్లెట్‌తో త‌యారు చేసిన విగ్ర‌హం భ‌క్తుల‌ను ఆక‌ట్టుకుంది.ఆరేండ్లుగా చాక్లెట్ వినాయ‌క విగ్ర‌హాలు త‌యారు చేస్తున్నామ‌ని ఆ బేక‌రీ య‌జ‌మాని కుక్రేజా తెలిపారు.

ప‌ర్యావ‌ర‌ణానికి ఎలాంటి హాని క‌లిగించ‌కుండా వినాయ‌క చ‌వితి జ‌రుపుకోవాల‌నే ఇలా చాక్లెట్ విగ్ర‌హం త‌యారు చేసిన‌ట్టు చెప్పాడు.బేకరీ య‌జ‌మాని హ‌ర్జీంద‌ర్ సింగ్ కుక్రేజా త‌న ఇన్ స్టాగ్రామ్‌లో చాక్లెట్ వినాయ‌క విగ్ర‌హం షేర్ చేయ‌డంతో అది వైర‌ల్‌గా మారింది.

ఇలాంటి చాక్లెట్ విగ్ర‌హం త‌యారు చేయ‌డానికి త‌మ‌కు ప‌ది రోజుల స‌య‌మం ప‌ట్టింద‌ని కుక్రేజా తెలిపారు.

Telugu Bakery, Bakery Kukreja, Ludhianan, Punjab, Vinayaka Idol-Latest News - Te

10మంది చెఫ్‌లు 200 కిలోల కంటే ఎక్కువ బెల్జియన్ డార్క్ చాక్లెట్‌ను ఉపయోగించి వినాయ‌క విగ్ర‌హాన్ని త‌యారు చేశారు.ఇది అంత సులభమైన పని కాదని , చిన్న త‌ప్పు జ‌రిగినా మ‌ళ్లీ మొద‌టి నుంచి త‌యారు చేయాల‌ని చెబుతున్నాడు.ఏదైనా కొత్త‌గా త‌యారు చేయ‌డానికి స‌వాళ్లు కూడా స‌ర‌దాగా ఉంటుంద‌ని తెలిపాడు.

విగ్రహాన్ని పాలలో నిమజ్జనం చేసి, చిన్నాల‌కు ప్ర‌సాదంగా పంపిణీ చేస్తామ‌ని వివ‌రించాడు.ఇప్పటివరకు ఈ చాక్లెట్ విగ్ర‌హాన్ని 9 వేలకు పైగా మందికి చేరింది.త‌మ అభిప్రాయాన్ని వారు తెలియ‌జేస్తున్నారు.200 కిలోల విగ్రహాన్ని చూసి చాలా మంది ఆశ్చ‌ర్యానికి లోన‌వుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube