తండ్రి, కొడుకుల బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తండ్రి తన కొడుకును చిన్నప్పుడు తన భుజాల మీద మోస్తాడు.
కొడుక్కు ఏది కావాలంటే అది అడగక ముందే తెచ్చి ఇస్తాడు.అయితే కొడుకు విషయంలో ఎప్పుడూ కూడా తండ్రి వెనకడుగు వేయడు.
అయితే కొడుకులు పెద్దయ్యాక మాత్రం తండ్రిని పట్టించుకోకుండా ఉండటం కూడా చూస్తున్నాం.అదే సమయంలో తండ్రికి ఎనలేని సేవలు చేస్తున్న కొడుకులను కూడా మనం అనేక మందిని చూస్తున్నాం.
ఇలా తండ్రికి సేవలు చేస్తున్న కొడుకు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చాలామంది రోడ్ల పక్కన కదలలేని స్థితిలో ఉన్న తన తల్లి లేదా తండ్రిని భుజాన వేసుకుంటూ మోయడాన్ని మనం చూస్తుంటాం.
ఇప్పుడు కూడా బ్రెజిల్ దేశంలో ఉండే అమెజాన్ అడవుల్లో ఓ తెగకు చెందిన వ్యక్తి తన తండ్రిని ఇలాగే మోసుకుంటూ వెళ్తున్నాడు.కాగా ఇందుకు సంబంధించిన ఫొటో అందరినీ కంటతడి పెట్టిస్తోంది.24 ఏండ్ల తైవీ అనే వ్యక్తి తన తండ్రి వాహూను ఇలా భుజాన వేసుకుని అడవి గుండా మోస్తున్నాడు.ఇలా తన తండ్రిని వాగులు, వంకలు దాటిస్తూ చాలా దూరం నడుచుకుంటూ వెళ్లి వ్యాక్సినేషన్ సెంటర్కు తీసుకెళ్లాడు.
దీంతో అతని ప్రేమకు అక్కడ ఉన్న డాక్టర్ ఎరిక్ కరిగిపోయాడు.ఇలా తన తండ్రిని ఇంత దూరం తీసుకురావడం పట్ల ముగ్ధుడు అయిపోయాడు.కానీ ఆ ఆ యువకుడు అంత దూరం మోసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది.ఆ వృద్ధుడికి వ్యాక్సిన్ వద్దని అక్కడి డాక్టర్ చెప్పాడు.కాగా కొద్ది కాలం తర్వాత ఆ వృద్దుడు మరణించాడు.ఇక తైవీనే తన కుటుంబానికి పెద్ద దిక్కుగా మారాడు.
ఇక అతను ఇప్పుడు మూడు డోసుల వ్యాక్సిన్ కూడా తీసుకున్నాడు.ఇక ఇలా తన తండ్రిని మోసుకుంటూ వెల్లిన ఫొటో ఇప్పుడు బాగా పాపులర్ అవుతోంది.
.