వైర‌ల్ పిక్‌.. చీర క‌ట్టుకుని మురిసిపోతున్న కోతి..

Viral Pic A Monkey Wearing A Sari

కోతి చేష్ట‌లు అంటే మామూలుగా ఉండ‌వు క‌దా.అవి ఎప్పుడు ఏం చేస్తాయో ఎవ‌రి అంచ‌నాల‌కు కూడా అంద‌వు.

 Viral Pic A Monkey Wearing A Sari-TeluguStop.com

అందుకే చిన్న పిల్ల‌లు కూడా ఏవైనా ఇలాంటి అల్ల‌రి ప‌నులు చేస్తే వారిని కోతి చేష్టలు చేయ‌కంటూ తిడుతారు త‌ల్లిదండ్రుల‌.అయితే ఇలాంటి కోతి చేష్ట‌ల‌కు సంబంధించిన వీడియోలు నిత్యం నెట్టింట విప‌రీతంగా వైర‌ల్ అవుతూనే ఉంటాయి.

కాక‌పోతే ఒక్కో వీడియోలో ఒక్కో ర‌క‌మైన కంటెంట్ అనేది ఉంటుంది.ఇప్పుడు కూడా ఓ కోతి చేసిన ప‌ని గురించి మ‌నం చెప్పుకోబోతున్నాం.

 Viral Pic A Monkey Wearing A Sari-వైర‌ల్ పిక్‌.. చీర క‌ట్టుకుని మురిసిపోతున్న కోతి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇది కొంచెం డిఫ‌రెంట్‌.

మామూలుగానే కోతుల‌కు సంబంధించిన వీడియోలు చాలా సర్క్యూలేట్ కావ‌డం మ‌నం చూస్తుంటాం.

ఇవి చూడ‌టానికి కూడా ఎంతో టైమ్ పాస్ లాగా అనిపిస్తుంటాయి.ఇలాంటి అల్ల‌రి వీడియోలు చూసిన‌ప్పుడు మాత్రం మ‌న మైండ్‌లో ఉన్న టెన్ష‌న్లు మొత్తం ఇట్టే ఎగిరిపోతుంటాయి.

అందులో ఇప్పుడు మ‌నం చెప్పుకోబోయే ఫొట కూడా ఉంది.ఇందులో ఓ కోతి చీర క‌ట్టుకోవ‌డంలో ఉన్న గౌర‌వం గురించి చెబుతున్న‌ట్టు క‌నిపిస్తుంది.

సాధార‌ణంగా ఇవాళ రేపు ఆడ‌పిల్ల‌లు చీర క‌ట్టుకోవాలంటేనే తెగ ఇబ్బందిలాగా ఫీల్ అవుతున్నారు.

Telugu Monkey, Monkey Wearing Saree, Seven Roads Junction, Social Media, Srikakulam, Viral Animals Video, Viral Monkey, Viral Pic-Latest News - Telugu

కానీ ఇక్క‌డ మాత్రం ఓ కోతి ఏ మాత్రం నామూషిలా ఫీల్ అవ‌కుండా ఎంచ‌క్కా ఆడపిల్లలాగా చీర క‌ట్టుకుని సిగ్గులొలికిపోతూ మురిసిపోతున్న‌ట్టు మ‌న‌కు ఇందులో క‌నిపిస్తుంది.శ్రీకాకుళంలో పట్టణంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.ఏడు రోడ్ల జంక్ష‌న్ ద‌గ్గ‌ర్లో ఓ కోతి ఇలా ప‌సుపు రంగు చీర‌ను తీసుకుని త‌న‌కు న‌చ్చిన‌ట్టు చుట్టుకుని మ‌రిసిపోతున్న‌ట్టు ఫేస్ పెట్టింది.

ఇక ఈ కోతి చేష్ట‌ల‌న అక్క‌డున్న స్థానికులు ఆసక్తిగా చూస్తూ ఫొటోలు, వీడియోలు తీశారు.ఇంకేముంది ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు బాగా వైర‌ల్ అవుతున్నాయి.మీరు కూడా చూసేయండి.

.

#Pic #Srikakulam #Monkey #Monkey #Animals

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube