వైరల్ ఫొటోలు: భారతదేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జి.. ఎక్కడంటే..?

బంగాళా ఖాతంలోని పంబన్‌ దీవిని భారత ప్రధాన భూభాగాన్ని కలిపే “పంబన్ బ్రిడ్జి” 2.06 కిలోమీటర్ల పొడవు ఉంటుంది.ఈ వంతెన 1914లో తీసుకొచ్చారు.అప్పుడెప్పుడో నిర్మించిన ఈ బ్రిడ్జి ఇప్పుడు బాగా పాడైపోయింది.2018లో ఈ వంతెన పాడుకావడంతో అధికారులు మరమ్మతులు చేపట్టారు.అయితే బ్రిడ్జిపై రైళ్లు నడపడం అంత శ్రేయస్కరం కాదని భావించిన కేంద్ర ప్రభుత్వం కొత్త వంతెన నిర్మాణాలు ప్రారంభించింది.

 Viral Photos The First Vertical Lift Bridge In India Where, Viral Latest, News V-TeluguStop.com

తాజాగా దీని ఫొటోలను రైల్వే శాఖ మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.అలాగే ఈ వంతెనను 2022 మార్చి నాటికి వినియోగంలోకి తీసుకొచ్చేలా కృషి చేస్తున్నట్లు అశ్విన్‌ వైష్ణవ్‌ తెలిపారు.కాగా ఈ ఫొటోలు ప్రస్తుతం భారత దేశ వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి.

2010 వరకు అత్యంత పొడవైన భారత సముద్ర వంతెనగా పేరు పొందిన పంబన్ బ్రిడ్జి స్థానంలో.ఇప్పుడు వర్టికల్ లిఫ్ట్ రాబోతోంది.భారత దేశంలో నిర్మిస్తున్న తొలి రైల్వే వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జి ఇదే కావడం విశేషం.ఈ బ్రిడ్జి పేరుకు తగినట్లుగానే నిటారుగా పైకి లేవగలదు.ఈ బ్రిడ్జిని అరేబియన్ మహా సముద్రం పై నిర్మిస్తున్నారు.అయితే ఆ సముద్రంపై వెళ్లే పడవలు, భారీ షిప్‌లకు దారి ఇచ్చేందుకు ఇలా నిటారుగా లిఫ్ట్ చేయగల వంతెనను నిర్మిస్తున్నారు.“ఈ డ్యూయల్-ట్రాక్ అత్యాధునిక వంతెన దేశంలోనే తొలి వర్టికల్‌ లిఫ్ట్ రైల్వే సముద్ర వంతెనగా నిలుస్తుంది” అని అశ్విన్‌ వైష్ణవ్‌ పేర్కొన్నారు.

కొత్త బ్రిడ్జికి మార్చి 2019లో నరేంద్ర మోదీ పునాదిరాయి వేశారు.కాగా దాని నిర్మాణపనులు నవంబరు 9, 2019 నుంచి ఆరంభమయ్యాయి.బ్రిడ్జి కోసం సుమారు రూ.250కోట్లు వెచ్చిస్తున్నట్లు సమాచారం.ఈ బ్రిడ్జి వినియోగంలోకి రాగానే రామేశ్వరానికి రైళ్లను అధికవేగంతో నడపొచ్చు.అలాగే ఎలాంటి భయం లేకుండా సురక్షితంగా హెవీ వెయిట్ లోడ్‌లను రవాణా చేయొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube