వైరల్ ఫోటో : హిమాలయాల్లో వైల్డ్ డాగ్ టీమ్!  

wild dog team in the himalayas Nagarjuna, Wild Dog, Himalayas, Diya Mirza, Ali, Mayank, Prakash, Ahishor Solomon - Telugu @iamnagarjuna, Ahishor Solomon, Ali, Diya Mirza, Himalayas, Mayank, Prakash, Wild Dog, Wild Dog Team In The Himalayas Nagarjuna

టాలీవుడ్ ప్రముఖ యాక్టర్ అక్కినేని నాగార్జున తాజాగా నటిస్తున్న చిత్రం“వైల్డ్ డాగ్”.ఈ చిత్ర నిర్మాణంలో భాగంగా షూటింగ్ లొకేషన్ నుంచి ఒక వీడియో ని నాగార్జున షేర్ చేశారు.ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపు ఇచ్చిన నేపథ్యంలో అన్ని జాగ్రత్తలను పాటిస్తూ, చిత్ర నిర్మాణం జరుగుతుంది.ఇందులో భాగంగానే ప్రస్తుతం ఈ సినిమా హిమాలయ ప్రాంతాలలో షూటింగ్ జరుపుకుంటుంది.

TeluguStop.com - Viral Photo Wild Dog Team In The Himalayas

ఇటీవల కాలంలో హిమాలయాల్లోని రోహ‌తంగ్ పాస్ ప్రాంతంలో వైల్డ్ డాగ్ మెంబర్స్ ఉన్న ఒక ఫోటో ను షేర్ చేశారు.

ఈ ఫోటోలో నాగార్జున, సయామిఖేర్, అలీ, మయాంక్, ప్రకాష్ సహా మరో సభ్యులు ఉన్న ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ ఫోటో చూస్తే వైల్డ్ డాగ్ టీం మెంబెర్స్ అటవీ ప్రాంతంలో యుద్ధంలో పాల్గొంటున్న సన్నివేశం అని మనకు అర్థమవుతుంది.

TeluguStop.com - వైరల్ ఫోటో : హిమాలయాల్లో వైల్డ్ డాగ్ టీమ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

హిమాల‌యాల్లో “వైల్డ్ డాగ్ టీం.స్వేచ్చ‌ను, ప్ర‌కృతిని ప్రేమిస్తూ” అంటూ ఈ ఫోటోలను నాగార్జున తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు.

నాగార్జున, దియా మీర్జా తదితరులు ఈ వైల్డ్ డాగ్ అనే యాక్షన్ త్రిల్లర్ చిత్రం ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు.ఈ చిత్రాన్ని సినిమా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా,ఆశిషోర్ సోలమన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రంలో నాగార్జున పాత్ర ఎంతో భిన్నంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు.

అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటున్న నేపథ్యంలో నాగార్జున ఎంతో బిజీ షెడ్యుల్ ని గడుపుతున్న విషయం మనకు తెలిసిందే.

ఒకవైపు బిగ్ బాస్ సీజన్ ఫోర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.మరోవైపు వైల్డ్ డాగ్ చిత్ర నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో నాగార్జున షూటింగ్ లో పాల్గొంటే, బిగ్ బాస్ వ్యాఖ్యాతగా పలువురు సినీ నటులు వస్తారని ఇప్పటికే ప్రచారంలో ఉంది.

అయితే ప్రస్తుతం వైల్డ్ డాగ్ సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తున్నాయి.

#Himalayas #Prakash #Diya Mirza #Wild Dog #@iamnagarjuna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Viral Photo Wild Dog Team In The Himalayas Related Telugu News,Photos/Pics,Images..