క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ మైదానంలో అడుగుపెడితే పరుగుల వరద పారాల్సిందే.ఆయన ఉంటే చాలు ఇండియా గెలుస్తుందనేది అభిమానుల నమ్మకం.
ఏ ఫార్మాట్లో అయినా తనదైన దూకుడుతో జట్టును విజయతీరాలకు చేరుస్తుంటారు కోహ్లీ.అయితే క్రికెట్లోనే కాదు.
మనోడు బయట కూడా అంతే స్టైలిష్‌గా ఉంటాడు.ఇప్పటికే ఎన్నో ప్రాడక్టులకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటున్నాడు కోహ్లీ.
ఇక చాలా మంది అభిమానులు విరాట్ కోహ్లీ గడ్డం, హెయిర్ స్టైల్‌ని ఫాలో అవుతున్నారడంలో ఎలాంటి సందేహం ఉండదు.అతడి హెయిర్ స్టైల్, గడ్డం స్టైల్‌కి దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంది.
ఇక ప్రస్తుతం విరాట్ భారీ గడ్డంతో ఉన్న న్యూ లుక్ ఫొటో సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది.మునుపెన్నడూ లేనంత స్టైలిష్ గా ఉన్నాడు విరాట్ కోహ్లీ.
సినిమా హీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా ఉంది ఆ ఫొటో.
అయితే ఇప్పుడు ఆ ఫొటోను చూసి అభిమానులు తెగ సంబుర పడుతున్నారు.అసలు విరాటేనా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.మరి కొంతమంది అయితే ప్రముఖ వెబ్ సిరీస్ మనీ హీస్ట్ లో ప్రొఫెసర్‌తో పోల్చుతున్నారు.
ఇలా రకరకాలుగా కామెంట్లు పెడుతూ ఆ పొటోను టాప్ ట్రెండింగ్‌లో ఉంచుతున్నారు.సినిమా హీరోల కంటే సూపర్‌గా ఉందంటూ ఆ ఫొటోస్‌పై మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.
ఇక ఇప్పుడు ఐపీఎల్ 14సీజన్ రద్దయిన సంగతి తెలిసిందే.ఇప్పుడు కొవిడ్ సంక్షోభం నేపథ్యంలో విరుష్క జంట పేదవారిని ఆదుకోవడం కోసం ముందుకొచ్చింది.వారికి ట్రీట్మెంట్ అందించడానికి ఇప్పటికే రూ.14కోట్ల విరాళాలు సేకరించింది.దాంతో చాలామందికి సాయం చేస్తున్నారు.ఆక్సిజన్లు, బెడ్లు, రెమిడెఇసివిర్, ఇతర మెడిసిన్లు ఇలా రకరకాలుగా సాయం చేస్తున్నారు.చాలామంది పేదోళ్లకు అన్నం పెడుతున్నారు.దీంతో వారి జంటకు దేశ వ్యాప్తంగా పేరు వస్తోంది.
ఇప్పుడు న్యూ ట్రెండింగ్‌లో ఉన్న ఆ కోహ్లీ ఫొటోను మీరు కూడా చూసేయండి.