వైరల్ ఫోటో: ఫుడ్ బాక్స్ పై ర్యాటిల్ స్నేక్..!

పల్లెటూరులో ఇంట్లోకి పాములు రావడం సహజమే.అందుకుకే ఊర్లలో ఉండే వాళ్ళు ఎప్పటికప్పుడు ఇంటిని సర్దుతూ ఇంట్లో అన్ని ప్రదేశాలను మంచిగా పెట్టుకుంటుంటారు.

 Viral Photo  Rattle Snake On Food Box , Viral Photo, Food, Online Order, Snake,-TeluguStop.com

ఇక పట్టణంలో పాములను చూడాలని అంటే జూ లాంటి ప్రదేశాలకు వెళ్లి చూసి రాల్సిందే.అయినా ప్రాంతం ఏదైనా ఆయా ప్ర‌దేశాల్లో మ‌న క‌ళ్ల‌కు స‌రిగ్గా క‌నిపించ‌కుండా పాములు ఉంటాయి.

అదేంటి మనం ఉండేది సిటీలో కదా మన ఇంట్లో పాములు ఎలా వస్తాయి అనుకోవచ్చు.అంతేకాదు.

మన బయటికి వెళ్లి ఫుడ్ తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు.ఇక ఇంట్లో ఉండి ఆన్‌ లైన్‌ లో ఫుడ్‌ ఆర్డర్‌ చేయగానే ఆ సంస్థలు ఆహరాన్ని మన వద్దకు చేరుస్తాయి.

ఒక్కొసారి మనం అందుబాటులో లేకపోతే.ఎలా అనుకుందో ఏమో కానీ.

ఆ సంస్థ అక్కడ ఒక పాముని కాపాలాగా పెట్టింది.ఇది నిజం అండి కావాలంటే ఈ వార్తను చదివేయండి.

ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.అమెరికాలోని అరిజోనాకు చెందిన ఒక మహిళ ఉబెర్‌ ఈట్స్‌ లో ఫుడ్‌ కోసం ఆర్డర్‌ పెట్టింది.డెలీవరి బాయ్‌ వచ్చి ఫుడ్‌ ఆర్డర్‌ ను ఇంటి బయట పెట్టేసి వెళ్లాడు.దాన్ని తీసుకుందామని వెళ్ళిన మహిళ ఒక్కసారి షాక్‌ కు గురయ్యింది.

కాసేపటికి తెరుకుని ఫుడ్‌ డెలివరి కవర్‌ పక్కన ఒక పాముని గమనించింది.అది భయంకరమైన వెస్ట్రర్న్‌ డైమండ్‌ రాటిల్‌ స్నేక్‌.

ఇది భయంకరమైన విషాన్ని కలిగి ఉంటుంది.

ఇక ఇవి ప్రధానంగా యూనైటేడ్‌ స్టేట్స్, మెక్సికోలో ఎక్కువగా కనిపిస్తాయి.

ఈ పాము కాటుకి గురై ఇప్పటికే మెక్సికోలో​ చాలా మంద బలయ్యారు.అయితే అది గమనించిన ఏం కాసేపటికి తెరుకొని ఆమె పాములను పట్టుకునే సంస్థకు ఫోన్‌ చేసింది.

రాటిల్‌ స్నేక్‌ సొల్యూషన్‌, రీలోకేషన్‌ వారు వచ్చి ఆ పామును పట్టుకున్నారు.ప్రస్తుతం దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలను స్నేక్‌ రీలోకేషన్‌ వారు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube