సాహో సినిమా తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ తన తర్వాతి చిత్రం కోసం చాలానే కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.కరోనా వైరస్ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న రాధేశ్యామ్ సినిమాకు సంబంధించి షూటింగ్ ప్రక్రియ లేట్ అయ్యింది.
ఇక అసలు విషయంలోకి వెళితే.తాజాగా డార్లింగ్ ప్రభాస్ సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ ఫోటోలో కనబడుతున్న ప్రభాస్ ఇది వరకు కనిపించిన లుక్ కు కాస్త భిన్నంగా చాలా స్మార్ట్ గా తయారయ్యారు.బాహుబలి, సాహో సినిమాలలో కనిపించిన అతని శరీర కండలు పూర్తిగా తగ్గినట్లు కనబడుతోంది.
తాజాగా కనిపిస్తున్న ఈ కొత్త లుక్ లో కొత్త ప్రభాస్ గా కనిపిస్తున్నాడు.
తాజాగా హీరో ప్రభాస్ శారీరకంగా మారిన తీరు ఎంతో బాగుందని ఆయన చాలా హ్యాండ్సమ్ గా, కనపడుతున్నట్లు పెద్దఎత్తున కామెంట్స్ చేస్తున్నారు.
దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రభాస్ కు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు వైరల్ గా మారాయి.సాహో సినిమా తర్వాత నటిస్తున్న రాధేశ్యామ్ సినిమా చిత్రీకరణ దాదాపు అయిపోవడానికి వచ్చింది.
ఈ సినిమాకు సంబంధించి చివరి షెడ్యూల్ హైదరాబాద్ నగరంలోని ఓ ఫిల్మీ స్టూడియోలో ఏర్పాటు చేసి అక్కడ ఓ భారీ సెట్ లో షూటింగ్ జరుగుతోంది.అందుకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
అతి త్వరలో పూజా హెగ్డే ప్రభాస్ ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ లో పాల్గొన్నబోతున్నట్లు సమాచారం.క్లైమాక్స్ సీన్ కోసం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ నిక్ తో కలిసి పని చేయబోతున్నారు చిత్ర బృందం.
ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యాం సినిమా తర్వాత టాలీవుడ్ లో ఆదిపురుష్ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో చిత్రాన్ని తెరకెక్కించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.ఇందుకు సంబంధించి రెండు ప్రాజెక్టులు వచ్చే సంవత్సరం మొదలు కాబోతున్నాయి.బాలీవుడ్ లో నిర్మాణం జరగబోతున్న ఆదిపురుష్ సినిమా సంబంధించి రిలీజ్ డేట్ కూడా చిత్ర బృందం ఆగస్టు 11, 2022న అంటూ తెలిపింది.ఇందులో ప్రభాస్ సరసన సైఫ్ అలీఖాన్, దీపికా పదుకునె లాంటి బాలీవుడ్ స్టార్స్ నటించబోతున్నారు.