అమెరికా మిలటరీ పరువు తీసిన ఫోటో..వైరల్..!!

ప్రపంచం మొత్తం నూతన సంవత్సర వేడుకలని ఎంతో ఘనంగా జరుపుకుంది.అలాగే అమెరికా మిలటరీ సైతం ఈ వేడుకలని జరుపుకుంది కాని కొంచం వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపింది.

 Viral Photo Of American Military B2 Stealth Bomber-TeluguStop.com

దాంతో అమెరికా మిలటరీకి నెటిజన్లు తలంటేశారు దాంతో క్షమాపణలు చెప్పే పరిస్థితి ఏర్పడింది.ఇంతకీ ఆ వినూత్న శుభాకాంక్షలు ఎలా చెప్పిందంటే.

కొత్త సంవత్సరం పురస్కరించుకుని అమెరికా మిలటరీ బాంబులు జారవిడుస్తున్న బీ-2 అనే యుద్ధ విమానానికి సంబంధించిన వీడియోను జతచేసి తన ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపింది.దాంతో ఆ ట్వీట్ తీవ్ర వివాదాస్పదం అయ్యింది.అమెరికాకు అణుయుద్ధం మీద ఇంత వేళాకోళం ఎందుకు అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.దాంతో

ఆ నెటిజన్ ని ఫాలో అవుతూ నెటిజన్లు అందరూ మిలటరీని దుమ్ము దులిపేశారు.దాంతో అమెరికా మిలటరీ మేలుకుంది.అందరికి క్షమాపనలు చెప్పింది.

మేము విలువలకు అనుగుణంగా శుభాకాంక్షలు చెప్పలేకపోయాము అందుకు చింతిస్తున్నాము అంటూ క్షమాపణలు కోరుతూ మరో ట్వీట్ చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube