వైరల్ ఫోటో: బాలుడి చెంపపై బల్లి అచ్చు.. అసలు ఏమైంది అంటే..?!

తైవాన్ దేశానికి చెందిన ఒక స్కూల్ పిల్లోడు హోంవర్క్ చేస్తూ అలాగే పుస్తకం పై తల వాల్చి నిద్ర లోకి జారుకున్నాడు.కొద్దిసేపటి తర్వాత నిద్ర నుంచి లేచాడు.

 Viral Photo Lizard Mold On Boys Cheek What Is The Real Meaning-TeluguStop.com

అయితే మొహం కడుక్కుంటున్న సమయంలో తన చెంపపై ఏదో అచ్చు పడినట్టు అనిపించింది.దీనితో తన చెంప కి ఏమైందో తెలుసుకోవడానికి అద్దం లో చూసుకున్నాడు.

అయితే అద్దంలో కనిపించిన దృశ్యాన్ని చూసి షాక్ అయ్యాడు.అతని చెంప పై ఒక బల్లి అచ్చు కనిపించింది.

 Viral Photo Lizard Mold On Boys Cheek What Is The Real Meaning-వైరల్ ఫోటో: బాలుడి చెంపపై బల్లి అచ్చు.. అసలు ఏమైంది అంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సాధారణంగా బల్లి ని చూస్తే మనకు భయమేస్తుంది.అలాంటిది పడుకోని నిద్ర లేవగానే ఒక పల్లి అచ్చు మన శరీరంపై పడితే ఎంత భయమేస్తుంది ఊహించుకోవచ్చు.

అయితే తన చెంప పై బల్లి అచ్చును చూసిన తర్వాత ఈ బాలుడు వెంటనే తాను పడుకున్న ప్లేస్ కి వెళ్లి చూసాడు.ఐతే అక్కడ ఉన్న ఓ పుస్తకంపై ఒక బల్లి చనిపోయింది.

దీంతో తాను పడుకుంటున్న సమయంలో ఒక బల్లి పై తలపెట్టి పడుకున్నాను అని ఆ బాలుడికి అర్థమయింది.అయితే ఈ విద్యార్థి తల బరువు కి ఊపిరి ఆడక ఆ బల్లి చచ్చిపోయింది.

అయితే తాను పొరపాటున ఒక బల్లి పై పడుకున్నానని.దీనివల్ల తనకు ఏమైనా అవుతుందేమోనని ఆ బాలుడు తీవ్ర భయాందోళనకు గురవుతున్నాడట.

ఐతే తాజాగా జాక్సన్ లూ అనే ఒక ట్విట్టర్ యూజర్.విద్యార్థి ఫోటో తో పాటు నోట్ బుక్ పై చనిపోయి ఉన్న బల్లి ఫోటోని కూడా షేర్ చేశారు.

హోంవర్క్ చేస్తూ నిద్రపోతే పర్లేదు కానీ ఒక బల్లి పై పడుకున్నాను అనే విషయాన్ని కూడా గ్రహించకపోతే ఎలా? అని ఆ ట్విట్టర్ యూజర్ తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.అయితే ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.

ఈ పిల్లోడు చెంపపై బల్లి అచ్చు చాలా పర్ఫెక్ట్ గా పడటంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

#Lizard Mold #Boy's Cheek

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు