వైరల్: పెళ్లికూతురును చూసి నివ్వెరబోతున్న జనం!

నానాటికీ రోజులు మారిపోతున్నాయి.డిజిటల్ యుగం మనిషిని పరిగెత్తిస్తోంది.

 Viral  People Who Are Surprised To Look At The Bride , Bride , Groom , Viral Lat-TeluguStop.com

ప్రపంచమే ఓ కుగ్రామం అయిపోయింది.ఈ క్రమంలో సోషల్ మీడియా పరిధి బాగా విస్తరించింది.

ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ తప్పనిసరి అయిపోయింది.అందువలన ప్రపంచంలో జరిగిన ఎలాంటి ఫన్నీ విషయమైనా ఇట్టే తెలిసిపోతుంది.

ఇది పెళ్లిళ్ల సీజన్ కనుక ఇటీవల పెళ్లిళ్లకు సంబంధించినటువంటి వీడియోలు అనేకం వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం ఓ వధువుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఆ వీడియోను చూసి నెటిజన్స్ నివ్వెరబోయారు.

వివరాల్లోకి వెళితే.

వివాహ వేడుక సంబరాలు షురూ అయ్యాయి.పెళ్లి మండపం కొత్త పెళ్ళికొడుకు, పెళ్లికూతురు కోసం వేచి చూస్తోంది.ఇక మరికొద్ది సేపట్లో పెళ్ళితంతు జరగనుంది అనుకొనే లోపే పెళ్లికూతురు చేసిన పనికి మండపంలోని ఉన్నవారంతా అవాక్కయ్యారు.అవును… తాను పెళ్లి చేసుకోబోయే వరుడికి స్పెషల్ గా పెళ్లి ప్రపోజల్ చేసింది ఆ పెళ్లికూతురు.ఇక్కడ విషయం ఏముందని అనుకుంటున్నారా? అక్కడే వుంది అసలు ట్విస్ట్.రోడ్డుమీద కదులుతున్న కారు బానెట్ పై కూర్చొని భవనంపైన ఉన్న వరుడికి సైగల ద్వారా పెళ్లి ప్రపోజల్ చేసింది మన నవతరం పెళ్లి కూతురు.

దాంతో అక్కడ వున్న అతిథులంతా నోళ్లెళ్లబెట్టుకొని చూస్తూ ఉండిపోయారు.మరికొంతమంది ఆ దృశ్యాన్ని తమ సెల్ ఫోన్ లలో బంధించారు.వీడియో తీసి మనవాళ్ళు ఆగుతారా? అబ్బే.అగరుగా.

సదరు వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయ్యింది.నెటిజన్స్ ఆ వీడియోని చూసి ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.

మరికొంతమంది అయితే వారెవ్వా అంటూ పెళ్లికూతురిని పొగిడేస్తున్నారు.తాముకి అలంటి అవకాశం లేకుండా పోయిందని తెగ బాధ పడుతున్నారు.

మరెందుకాలస్యం.మీరుకూడా ఆ వీడియో చూసి అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube