వైరల్ : పవన్ రానా సినిమా.. ఫోటో లీక్!

ప్రస్తుతం సోషల్ మీడియా వాడుక ఎక్కువగా ఉన్నందున.దీనిపై ప్రభావం కూడా అంతే ఎక్కువగా ఉంది.

 Viral Pawan Rana Movie Photo Leak-TeluguStop.com

ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకోగా.టీవీ లో కంటే ముందు సోషల్ మీడియాలోనే ప్రసారమవుతున్నాయి.

ఇక సమాచారం తెలిసిన వెంటనే సోషల్ మీడియా ద్వారా బయటపడటమే కాకుండా.వెంటనే కొన్ని నిమిషాల పరిధిలోని షేరింగ్ అవుతుంటాయి.

 Viral Pawan Rana Movie Photo Leak-వైరల్ : పవన్ రానా సినిమా.. ఫోటో లీక్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక్కడి వరకు బాగానే ఉంటే.సినిమావాళ్ళకు మాత్రం సోషల్ మీడియా పెద్ద తలనొప్పిగా మారింది.

సినిమాల విషయంలో దర్శక నిర్మాతలు సినిమాకు సంబంధించిన విషయము గాని, కథ గాని, హీరో పాత్ర గాని తాము విడుదల చేసే వరకు బయట ఎక్కడా లీక్ కాకుండా జాగ్రత్త పడుతుంట‌ారు.అంతేకాకుండా నటించే నటుల విషయాలను కూడా బయట పెట్టకుండా జాగ్రత్త పడుతున్న సమయంలోనే సోషల్ మీడియా ద్వారా బయటపడుతున్నాయి.

Telugu Ayyappanum Koshiyum, Mahesh, Malayalam Remake, Pawan, Photo Leaked, Rana, Social Media, Tollywood, Viral-Movie

ఇదిలా ఉంటే మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా కు సంబంధించిన కొన్ని ఫోటోలు లీక్ అయిన సంగతి తెలిసిందే.అంతేకాకుండా అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమా, పవన్ కళ్యాణ్ సినిమా వకీల్ సాబ్, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా కూడా కొన్ని లీకుల బెడదను ఎదుర్కొన్నాయి.ఆ సినిమాలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.

ఇదిలా ఉంటే మరో సినిమా కూడా లీకుల బెడద ను ఎదుర్కొంది.

పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న మలయాళం రీమేక్ సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్‘.ఈ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు.

తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఫోటో ఒకటి లీక్ అయింది.పవన్ కళ్యాణ్ గోడ దూకుతూ ఉండగా ఎదురుగా పోలీసులు ఉన్నా ఫోటో లీక్ అవ్వగా ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ గా మారింది.

#Pawan #Viral #Rana #Social Media #Mahesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు