కొన్ని సార్లు కొన్ని విషయాలు చూస్తుంటే మన కండ్లను మనమే నమ్మలేకపోతాం.చాలా విచిత్రమైన పరిస్థితులను మనం సోషల్ మీడియాలో మాత్రమే చూడగలుగుతాం.
ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి వింత జరిగినా సరే అది క్షణాల్లో వైరల్‌గా మారిపోవడం కేవలం సోషల్ మీడియాలోనే సాధ్యమేమో.ఇక ఇప్పుడు కూడా అలాంటి ఘటనే ఒకటి విపరీతంగా హల్ చల్ చేస్తోంది.
అదేంటేంటే మనకు సాధారణంగా కడుపు నొప్పి రావడానికి చాలా సింపుల్ కారణాలే మనకు తెలిసినవే ఉంటాయి.తిన్నది అరగకపోవడమో లేదంటే ఇతర ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి.
లేదంటే ఏవైనా కణతి లాంటివి ఉంటే వాటిని డాక్టర్లు ఆపరేషన్ చేసి తీసేయడంతో మనం ఆ ప్రాబ్లమ్ నుంచి బయటపడుతాం.ఇక మనకు బయట పురుగులను చూస్తేనే చాలా దారుణంగా అనిపిస్తుంది.
ఇక అలాంటిది మన కడుపులో పురుగు ఉండి, అది కూడా బ్రతికి ఉన్నది అయితే.ఇంకెలా ఉంటుంది.ఇక ఇలాంటి పరిస్థితే ఎదురైంది ఓ వ్యక్తికి.59 ఏళ్ల ఓ వ్యక్తికి ఇలాగే విపరీతమైన కడుపు నొప్పి వస్తే వెంటనే ఆయన్ను డాక్టర్లు కొలొనోస్కోపీ చేయించగా విస్తుపోయే నిజాలు తెలిసాయి.ఏంటంటే ఆయన కడుపులో సజీవంగా ఉన్న ఓ Worm ఉంది.
ఇక ఇలాంటి రిపోర్టు చూశాక ఎవరైనా ఖంగుతినకుండా ఉంటారా ఆ డాక్టర్ల పరిస్థితి కూడా అదే మరి.
కాగా అసలు బతికి ఉన్న పురుగు కడుపులోకి ఎలా వెళ్లిందో ఎవరికీ అర్థం కావట్లేదు.ఇక దాన్ని ఇలాగే వదిలేస్తే లాభం లేదని చివరకు దాన్ని ఎంతో జాగ్రత్తలు తీసుకుని మరీ రెండు గంటల పాటు కష్టపడి ఆపరేషన్ చేసి చివరకు దాన్ని కడుపు నుంచి డాక్టర్లు బయటికి తీశారు.
అయితే ఇది మాత్రమే కాకుండా గతంలో కూడా ఓ వ్యక్తి కడుపులో ఇలాగే సేమ్ బొద్దింక బతికి ఉన్న ఘటన కూడా చేసుకున్న విషయం అందరికీ విదితమే.