వైరల్: ఒంటికాలితో అద్భుతం సృష్టించిన పారాలింపియన్..!

కొంతమంది ఏదైనా సాధించాలి అనుకుంటే దాన్ని సాధించే వరకు పట్టు విడవకుండా విజయం వైపు అడుగులు వేస్తూ ఉంటారు.విజయసాధనలో వారికి ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

 Paralympian, Viral Latest, Female Bodybuilder, Athens Paralympics, Iwf Beijing 2-TeluguStop.com

వారి లక్ష్య ఛేదనలో ఒక్కసారి ఆ లక్ష్యం చేరుకోగా ఎన్ని సమస్యలు ఎదుర్కొన్న అవన్నీ కూడా ఒక్కసారిగా గుర్తుకురావు.ఇదే విషయాన్ని తెలియచేసింది ప్రముఖ ఫిమేల్ బాడీ బిల్డర్ పారాలింపియన్ గ్యు యునా.35 సంవత్సరాల వయసులో కూడా అనేక పథకాలు సొంతం చేసుకుని, తనకు ఎవరు పోటీ కాదని అంతర్జాతీయ వేదికపై తన సత్తాను చాటడంతో చైనాలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా నిలుస్తోంది.

అలాగే ఈమెకు సంబందించిన ఫోటోలు, కథనాలు ఆశక్తికరంగా మారడంతో సోషల్ మీడియాలో వైరల్ గా అవుతున్నాయి.

అలాగే ఈమె కథనం ఎంతోమందికి ఆదర్శంగా నిలవడంతో పాటు, మానసిక ఒత్తిడికి గురైన వారికి మెడిసిన్ లాగా పనిచేస్తుంది.ఈమె లాంగ్ జంప్ క్రీడాకారిణి, 2004 సంవత్సరంలో ఎట్ ఎక్స్ లో జరిగిన పారాలింపిక్స్ లో ఆవిడ పాల్గొనింది.

ఆ సమయంలో ఈమెకు బాడీ బిల్డింగ్ చాలా కొత్త.తాజాగా IWF బీజింగ్ 2020 వేదికపై గ్యు యునా బికినీలో చంకలో ఊత కర్రలు ఉండడం చూసి అందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

ఇందుకు సంబంధించిన ఫోటోలు అతి తక్కువ సమయంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అంతేకాకుండా కేవలం పాజిటివ్ ఆటిట్యూడ్ తోనే తనలోని శరీరం వైకల్యాన్ని అధిగమించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ప్రస్తుత సమాజంలో అన్ని అవయవాలు బాగున్నా కానీ కొన్ని విజయాలు సొంతం చేసుకోవాలంటే నానా తంటాలు పడుతుంటారు.

Telugu Athens Paralym, Iwf, Paralympian, Latest-Latest News - Telugu

ఈ సందర్భంగా ఆమె మాట్లాడిన మాటలు ఎంతో మందికి ఎంతో గొప్పగా ఉన్నాయని అందరూ అనుకుంటారు.ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ.నన్ను విజేతగా నిలిపింది నా కండలు, ప్రొఫెషనలిజం కాకపోవచ్చు.

నా లోని ఆత్మవిశ్వాసం, ధైర్యసాహసాలు నన్ను నేను ఇలా లోకానికి చూపించుకోవడం ద్వారా గెలుపును సొంతం చేసుకున్నాని తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube