వైరల్: 15 సంవత్సరాలకే 400 పైగా మెడల్స్..!

కొంతమంది చిన్న వయసు నుండే ఎన్నో విషయాలలో ఆరి తెరుతు ప్రపంచం నలుమూలల వారి పేరును వినిపించేలా విజయాలను సొంతం చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు.ప్రపంచం పూర్తిగా తెలియని వయసులోనే 15 సంవత్సరాల ఉన్న మహారాష్ట్రకు చెందిన ఖుషి అనే అమ్మాయి సాధించిన విజయాలు రికార్డులు ఎన్నో.

 15 Years, 400 Models, Medals, Carate, Viral Post, Viral Latest, Khushi From Maha-TeluguStop.com

ఆ అమ్మాయికి తన తల్లిదండ్రుల తోడ్పాడు కారణంగా ఆవిడ ఎన్నో అద్భుతాలు సృష్టించింది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.

ఖుషి తన పంచ్ పవర్ తో పదునైన పంచ్ షాట్ లతో ప్రత్యర్థులను ఎవరైనా సరే అయితే మట్టి కరిపించేది. ఈ అమ్మాయి చిన్నతనంలోనే కరాటే ప్రాక్టీస్ మొదలు పెట్టి అతి తక్కువ సమయంలోనే తన చేతులను రాళ్ళలా మార్చుకొనింది.

కేవలం నాలుగు సంవత్సరాల వయసులోనే ఇంటర్ స్టేట్ చాంపియన్ ను రికార్డు సృష్టించింది.అంతేకాదు ఆ టోర్నీలో సిల్వర్ మెడల్స్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.ఇక అప్పటి నుంచి మొదలైన తన విజయపరంపర ముందుకు సాగుతూనే ఉంది.

Telugu Models, Carate, Medals, Latest-Latest News - Telugu

ఖుషి ఇప్పటివరకు తన 15 సంవత్సరాల వయసులోనే నాలుగొందల జాతీయ అంతర్జాతీయ పథకాల ను సొంతం చేసుకుంది.ఈ విజయాలను గురించి ఖుషి మాట్లాడుతూ.తన గెలుపుకి కారణం తన పేరెంట్స్ అంటూ గర్వంగా చెబుతోంది.

వారు నాకు కొండంత ధైర్యం ఇవ్వడం కారణంగానే తాను ఇలాంటి విజయాలను సొంతం చేసుకుంటున్నారు అని చెప్పుకొచ్చింది.ఖుషి ప్రపంచంలోనే అతి తక్కువ వయసులో బ్లాక్ బెల్ట్ పొందిన యంగెస్ట్ ఛాంపియన్.అలాగే 9 సంవత్సరాల వయసులోనే ప్రపంచంలోనే రెండో యంగెస్ట్ కరాటే డిగ్రీ పొందిన వ్యక్తిగా రికార్డు సాధించింది.2018 లో కేవలం 13 సంవత్సరాల వయసులో ప్రపంచ యంగెస్ట్ థర్డ్ డిగ్రీ బ్లాక్ బెల్ట్ పొందిన వ్యక్తిగా నిలిచింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube