వైరల్: అక్కడ కేవలం ఆడపిల్లలే పుడతరట..!

మన సమాజంలో ఆడపిల్లల మీద ఉండే చులకన భావం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.కడుపులో పెరిగేది ఆడపిల్ల అని తెలిసి ఎంతోమంది అమ్మకడుపులో ఉండగానే ఆ పసి ప్రాణాన్ని చిదిమేస్తున్నారు.

 Viral: Only Girls Are Born There ..! Girls Born, Village, Viral News, Viral Late-TeluguStop.com

మరి కొందరు ఆడపిల్ల పుట్టిందని ఆ మహిళను వేధించేవారు కూడా ఉన్నారు.ఇలాంటి ఘటనల వలన దేశంలో ఆడపిల్లల సంఖ్య క్రమంగా తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం అవతోంది.

కానీ ఒక గ్రామంలో మాత్రం అందరికి ఆడపిల్లలు మాత్రమే పుడుతున్నారు.అస్సలు మగపిల్లాడే పుట్టటం లేదు.

దీంతో ఆ గ్రామం నిండా అందరూ ఆడపిల్లలే కనిపిస్తారు.ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 సంవత్సరాల పాటు అంటే దశాబ్ద కాలం పాటు ఆ గ్రామంలో ఆడపిల్లలు తప్ప ఒక్క మగపిల్లాడు కూడా పుట్టలేదు అంటే ఒకసారి ఊహించుకోండి.

దీంతో స్థానిక ప్రభుత్వం ఆ గ్రామంలో మగపిల్లాడు పుడితే ఆ తల్లిదండ్రులకు బహుమతి ఇస్తామని ప్రకటించింది.ఇంతకీ ఆ గ్రామం ఎక్కడ ఉందో తెలుసా.

అది పోలాండ్ దేశం లోని చెక్ రిపబ్లిక్ సరిహద్దులోని గ్రామం.పేరు మిజ్స్కే ఓడ్రేజ్ స్కీ.గత 10 ఏళ్లుగా ఆడపిల్లలు మాత్రమే పుట్టిన గ్రామం.అక్కడ కేవలం ఆడపిల్లలు మాత్రమే జన్మించారు.

ఇప్పటికి కేవలం ఆడపిల్లలే పుడుతున్నారు.ఈ వింత గ్రామంలో జనాభా సుమారు 300 మంది ఉంటారు.

వీరిలో మగవారి సంఖ్య చాలా అంటే చాలా తక్కువ.ప్రతి కుటుంబంలో ఇక్కడ ఆడపిల్లలు మాత్రమే పుడుతుండటంతో గ్రామంలో మగవారి సంఖ్య రాను రాను తగ్గిపోతోంది.

దీంతో మగపిల్లాడు పుడితే ఆ తల్లిదండ్రులకు ఇంటికి బహుమతి ఇస్తామని మేయర్ ప్రకటించారు.ఈక్రమంలో ఎట్టకేలకు గత సంవత్సరం అంటే 2020లో ఓ మగపిల్లాడు పుట్టాడు.

Telugu Born, Poland, Latest-Latest News - Telugu

ఇంకేముంది మగపిల్లాడి రాకతో ఆ కుటుంబమే కాకుండా మొత్తం ఆ గ్రామం అంతా పండుగ చేసుకుంది.వారి ఆనందాలకు అవధులు లేవు.సంబరాలు అంబరాన్ని అంటాయి.ఆ బిడ్డకు జన్మనిచ్చిన దంపతులను పెద్ద సెలబ్రిటీలుగా చూస్తున్నారు.అలా అని ఆడపిల్లలు పుట్టిన తల్లిదండ్రులు మాత్రం తమ ఆడపిల్లల్ని చూసి ఏమాత్రం బాధపడరు.ఆడపిల్లలను తక్కువగానూ చూడరు.

అయితే ఎక్కడ అర్ధం కానీ ప్రశ్న ఒక్కటి అందరి మదిలో మెదులుతూనే ఉంది.అది ఏంటంటే ఈ గ్రామంలో ఆడపిల్లలు మాత్రమే ఎందుకు పుడుతున్నారు? మగపిల్లలు ఎందుకు పుట్టటంలేదు అని ఈ మిస్టరీని ఛేదించటానికి చాలా ప్రయత్నాలు జరిగాయట.కానీ పెద్దగా ఫలితాలేవీ రాలేదని చెబుతున్నారు.దీనిపై పరిశోధనలు నిరంతరం జరుగుతునే ఉన్నాయట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube