వైరల్: కేవలం 212 గ్రా. బరువుతో జన్మించిన చిన్నారి.. చివరికి..?!

పిల్లలు పుట్టంగానే బొద్దుగా ముద్దుగా ఉంటారు.బోసినవ్వులతో, ఏడుపుతో సందడి చేస్తుంటారు.

 Only 212 G. Baby Born With Weight .. In The End  Guinness Record, Tiny Apple, Ba-TeluguStop.com

ఆ టైంలో శిశువును చూసి తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు.ప్రస్తుతం ఉన్న రోజులలో చాలామంది పిల్లల్లో బరువు తగ్గుతున్న సమస్య అనేది వాటిల్లుతోంది.

తాజాగా ఓ పిల్లాడు అతి తక్కువ బరువుతో పుట్టాడు.కానీ ఆ తర్వాత బలంతో ఎదిగాడు.

సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ హాస్పిటల్‌ లో 9 జూన్ 2020 న క్వెక్ యు జువాన్ అనే శిశువు జన్మించింది.పుట్టినప్పుడు శిశువు బరువు 212 గ్రా.

ఉంది.అంటే ఒక ఆపిల్ బరువంత ఉంది.ఆ తరువాత జూలై 9వ తేదిన డిశ్చార్జ్ సమయంలో జువాన్ బరువు 6.3 కిలోలు ఉంది.క్వెక్ యు జువాన్ పుట్టినప్పుడు ఊపిరితిత్తులు కూడా సరిగా అభివృద్ధి చెందలేదు.అందుకే శిశువు వెంటిలేటర్ లేకుండా శ్వాస తీసుకోలేకపోయింది.ఆ శిశువు చర్మం కూడా చాలా సున్నితంగా ఉండేది.ఆ చిన్నారి శరీరంలో ట్యూబ్‌ లు పెట్టడం చాలా కష్టమయ్యేదని నర్సులు కూడా చెప్పారు.

ఈ చిన్నారి తొడ నర్సు చేతివేళ్ల సైజులో ఉండేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.బాలికను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అయిన ఐసియుకి తీసుకు వచ్చినప్పుడు డాక్టర్ జాంగ్ సుహే తన కళ్లను తానే నమ్మలేకపోయారు.

తన 22 సంవత్సరాల కెరీర్‌ లో తాను ఇంతకు ముందు ఇలాంటి కేసును చూడలేదని ఆయన అన్నారు.బేబీ జువాన్ తండ్రి పేరు క్వాక్ వీ లియాంగ్, తల్లి పేరు వాంగ్ మెయి లింగ్ ఇద్దరి వయస్సు కూడా 35 సంవత్సరాలు.

Telugu Baby, Guinness, Long, Tiny Apple, Latest-Latest News - Telugu

అకస్మాత్తుగా నొప్పి రావడంతో తల్లి సింగపూర్‌ లో ఆడ శిశువుకు జన్మనిచ్చింది.ఈ చిన్నారి చికిత్స కోసం క్రౌడ్ ఫండింగ్ ద్వారా 2 కోట్ల 23 లక్షలను సేకరించారు.రూ.కోటి 48 లక్షలను శిశువు చికిత్స కోసం ఖర్చు చేశారు.మిగిలిన డబ్బును రాబోయే వైద్య ఖర్చుల కోసం అలానే పెట్టుకున్నారు.ప్రస్తుతం ఈ పాపకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube