ఈటెల ' టైమ్ ' బాగోలేదా ? ఎందుకిలా ? 

టిఆర్ఎస్ కు రాజీనామా చేయక ముందు వరకు ఈటల రాజేందర్ హవా హుజూరాబాద్ నియోజకవర్గంలో కనిపించేది.అక్కడ రాజేందర్ సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో పాటు, కొన్ని ప్రధాన సామాజిక వర్గాల అండదండలు పుష్కలంగా ఉండటం, ఉద్యమ కాలం నుంచి రాజేందర్ టిఆర్ఎస్ లో ఉంటూ, హుజూరాబాద్ నియోజకవర్గం లో తన ముద్ర కనిపించేలా చేసుకున్నారు.

 Viral On Etela Rajender Wall Clock Ditibution In Hujurabad Constancy-TeluguStop.com

ఇప్పుడు టిఆర్ఎస్ కు రాజీనామా చేసి బిజెపిలో చేరి ఉప ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు.ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా వెలువడకపోయినా, అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఈ నియోజకవర్గంపై దృష్టి పెట్టి నువ్వా నేనా అన్నట్లు గా గెలుపు కోసం పోటీ పడుతున్నాయి.

అయితే ఈ నియోజకవర్గం నుంచి రాజేందర్ పోటీ చేస్తారా లేక ఆయన సతీమణి జమున పోటీ చేస్తారా అనే  విషయం పెద్దగా క్లారిటీ లేకపోవడంతో సస్పెన్స్ నెలకొంది.ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం ఈటెల రాజేందర్ వర్గీయులు గోడ గడియారాలు పంపిణీ చేపట్టడం పై పెద్ద దుమారమే రేగింది.

 Viral On Etela Rajender Wall Clock Ditibution In Hujurabad Constancy-ఈటెల టైమ్ బాగోలేదా ఎందుకిలా  -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

గోడ గడియారాలు పంపిణీపై కొంతమంది బిజెపి నేతలు ముందే నిరసన వ్యక్తం చేశారు.అలాగే మరికొంతమంది గోడ గడియారాలు పగలగొట్టి నిరసన తెలిపారు.ఎలాబాక గ్రామంతో పాటు చల్లూరు , కోర్కల్ గ్రామాల్లోని దళిత కాలనీల్లో ఇదే విధమైన నిరసన వ్యక్తమైంది.కొద్ది రోజుల క్రితం వీణవంక మండలంలో లో బీజేపీ గుర్తు ఉన్న గోడ గడియారాలు పంపిణీ చేపట్టారు.

Telugu Bjp Wall Clock, Etela Rajendar Wall Clock, Etela Rajendra, Hujurabad, Kcr, Trs, Trs Government-Telugu Political News

 అలాగే జమ్మికుంట, వీణవంక, ఇల్లంతకుంట, హుజురాబాద్ మండలాల్లోని అనేక గ్రామాల్లో పంపిణీ చేశారు.వీటిపై చాలా మంది పెదవి విరిచారు.ఇటీవల హుజూరాబాద్ నియోజకవర్గం లోని ఓ ఓటరు ఈటెల రాజేందర్ అనుచరులు పంపిణీ చేసిన గోడ గడియారాన్ని నేలకేసి కొట్టి నిరసన వ్యక్తం చేశారు.తాజాగా వీణవంక మండలం లోనూ ఇదే పరిస్థితి ఎదురవడంతో ఈటల రాజేందర్ టైమ్ బాగోలేదు అంటూ టీఆర్ఎస్ శ్రేణులు సెటైర్లు వేస్తుండగా, ఇదంతా టిఆర్ఎస్ కుట్ర అని ఈటెల రాజేందర్ ను బద్నామ్ చేయడానికి కొంత మంది టీఆర్ఎస్ కార్యకర్తలను సాధారణ ప్రజలుగా చూపించి ఈ విధమైన వ్యవహారాలకు పాల్పడుతున్నారు అంటూ ఈటెల వర్గీయులు మండిపడుతున్నారు.

#Bjp Wall Clock #Etela Rajendra #EtelaRajendar #Hujurabad #TRS Government

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు