వైరల్: ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేయగా వచ్చిన పార్శిల్ ఓపెన్ చేసి చూశాడు... అంతే ఆకలి చచ్చిపోయింది!

కాలం ఎంతో మారింది.మనకు అవసరమైన వస్తువులతో పాటు, తినే తిండి కూడా ఇపుడు ఆన్లైన్లోనే కొనుక్కొంటున్నాం.

 Viral Ohio Doordash Customer Received Drugs Packet In His Food Order Details,  O-TeluguStop.com

ఇక బాగా ఆకలి వేయడంతో ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ పెట్టాడు.రావలసిన సమయం కన్నా ఆ పార్సిల్ ఓ అరగంట ఆలస్యంగా వచ్చింది.

దాంతో అతగాడు తినడం కోసమని ఆదరాబాదరా ఆ పార్శిల్‌ను విప్పి చూశాడు.ఇక అంతే.

అతడి ఆకలి ఒక్కసారిగా చచ్చిపోయింది.ఫుడ్‌తో పాటు వచ్చిన ప్యాకెట్ చూసి కళ్లు తేలేసాడు.

వివరాల్లోకి వెళ్తే.

అమెరికాలోని ఒహియో రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి డోర్‌ డాష్ అనే యాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ పెట్టాడు.

తీరా ఇంటికొచ్చిన పార్శిల్‌ను విప్పి చూడగా.డెలివరీ బ్యాగ్‌లో ఫుడ్‌తో పాటు గంజాయి ప్యాకెట్ ఒకటి దర్శనమిచ్చింది.

దీనితో ఆ వ్యక్తి ఒక్కసారిగా షాక్ అయ్యాడు.ఈ ఘటన ఆగష్టు 9వ తేదీన జరిగింది.

ఇక ఇక్కడ ఇంకో ఆసక్తికర విషయమేంటంటే.ఆ గంజాయి ప్యాకెట్ కోసం డెలివరీ బాయ్ మళ్లీ సదరు వ్యక్తి ఇంటికి తిరిగి రావడం కొసమెరుపు.

Telugu Complaint, Doordash, Drugs Packet, Ohio, Parcel, Latest-Latest News - Tel

అది తన స్నేహితుడికి మందు అని చెప్పి.దాన్ని ఇవ్వమని కోరాడు.అయితే సదరు వ్యక్తి ఆ గంజాయి ప్యాకెట్‌ను డెలివరీ బాయ్‌కు ఇవ్వకుండా.పోలీసులకు సమాచారాన్ని అందించాడు.అనంతరం డోర్ డాష్‌కు ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేశాడు.కాగా, ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తుండగా.

మరోవైపు కస్టమర్ కంప్లయింట్‌కు డోర్ డాష్ సంస్థ స్పందించింది.ఇలాంటి చర్యలను తమ సంస్థ అస్సలు క్షమించబోదని.

వెంటనే సదరు డెలివరీ ఏజెంట్‌ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube