వైరల్: ఆ ఏటీఎం లో రూ. 100 కి బదులు రూ. 500 నోట్లు.. ఎక్కడంటే..?!

మనం ఎప్పుడైనా ఏదైనా ఏటీఎం కి వెళితే.కార్డు పెట్టి ఎన్ని డబ్బులు డ్రా చేయాలని కొడితే అన్ని డబ్బులే వస్తాయి.

 Viral News, Social Media, 100 Notes, 500 Note, Social Media,latest News-TeluguStop.com

ఇది అందరికీ తెలిసిన విషయమే.కానీ ఎప్పుడైనా మనం డ్రా చేయాలనుకున్న డబ్బుల కంటే రెట్టింపు డబ్బులు లేదా కొంత ఎక్కువ డబ్బులు ఏటీఎం మనకు ఇస్తే ఎలా ఉంటుంది.

ఏటీఎం అలా ఎక్కువ డబ్బులు ఎందుకు ఇస్తుంది అని మీరు అనుకుంటున్నారేమో.కానీ అప్పుడప్పుడు అలా జరుగుతుంది.తాజాగా ఓ ఏటీఎంలో రూ.100 డ్రా చేయాలని కొడితే రూ.500 నోటు వచ్చింది.ఓ వ్యక్తి రూ.100, రూ.200 ఇలా డ్రా చేశాడు.అతని ఖాతాలో నుంచి కేవలం రూ.4 వేలు మాత్రమే కట్ అయ్యాయి.కానీ.అతని చేతికి రూ.20 వేలు వచ్చాయి.ఇది అందరికీ తెలిసి ఆ ఏటీఎం ఎదుట జనం క్యూ కట్టారు.

ఈ ఘటన తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది.

శనివారం ఉదయం అమరచింతలోని ఇండియా నెంబర్ 01 ఏటీఎం వద్దకు వెళ్లిన వారికి రూ.100 కు బదులు రూ.500 నోటు వచ్చింది.ఈ ఏటీఎంలో డబ్బులు ఎక్కువగా వస్తున్నాయన్న విషయం అందరికీ తెలిసింది.దీంతో జనం ఆ ఏటీఎం వద్దకు వెళ్లి.క్యూ కట్టారు.ఎంతో కొంత వచ్చిన కాడికి డబ్బులు తీసుకున్నారు.

ఆ సమయంలో అటుగా పోలీసులు వెళ్తుండగా.జనాలు వారిని చూసి పరుగులు తీశారు.

అనుమానం వచ్చిన పోలీసులు ఓ వ్యక్తిని పట్టుకుని అడగగా.అసలు విషయం తెలిసింది.

ఇదంతా లాక్ డౌన్ మినహాయింపు సమయంలోనే జరిగింది.రూ.4 వేలకు బదులు రూ.20 వేలు వచ్చాయని చెప్పడంతో పోలీసులు ఆ ఏటీఎంకు తాళం వేశారు.సంబంధిత బ్యాంకు సిబ్బందికి సమాచారం ఇచ్చారు.ఆ ఏటీఎం నుంచి 3 రోజుల్లో రూ.5 లక్షల 88 వేలు డ్రా చేసినట్లు బ్యాంకు సిబ్బంది గుర్తించారు.టెక్నికల్ గా ఏదో ప్రాబ్లెమ్ వల్ల ఇలా జరిగిందని, రూ.100 బాక్స్ లో రూ.500 నోట్లు ఉంచడంతో ఈ సమస్య ఏర్పడిందని తెలిపారు.నగదు డ్రా చేసిన వారికి అదనంగా వచ్చిన డబ్బును స్వచ్చంధంగా అప్పచెప్పాలని బ్యాంకు యాజమాన్యం సూచించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube