వైరల్: కొడుకు కోసం కోట్లతో వంతెనలు నిర్మిస్తున్న తల్లి..! ఎక్కడంటే..?

దేవుడు సృష్టిలో ఎన్నో జీవాలను సృష్టించినా, ప్రతి వ్యక్తికి తనకి కావలసిన వాటికి చేతికి అందించేలా అమ్మను సృష్టించాడన్న విషయం అందరికి తెలిసిందే.మనందరి తల్లి మనం ఎక్కడున్నా సరే.

 Viral News China Mother Built Footbridges Viral Latest-TeluguStop.com

ఆవిడ ఆలోచనలు మాత్రం మన వైపు ఉంటాయన్న దానిపై ఎటువంటి అతిశయోక్తి లేదు.ఇందుకు నిదర్శనంగా చైనా దేశానికి చెందిన ఓ తల్లి నిదర్శనంగా నిలుస్తోంది.

తన బిడ్డ స్కూలుకు వెళుతున్న దారిలో ట్రాఫిక్ ఎక్కువగా ఉందని నేపథ్యంలో ఏకంగా తన బిడ్డ కోసం రోడ్డుపై ఆ నగర ప్రభుత్వ అధికారుల అనుమతి తీసుకొని రెండు వంతెనలు నిర్మిస్తోంది.ఇందుకోసం ఆవిడ ఏకంగా భారత కరెన్సీ ప్రకారం కోటి పది లక్షల రూపాయలను ఖర్చు చేస్తోంది.

 Viral News China Mother Built Footbridges Viral Latest-వైరల్: కొడుకు కోసం కోట్లతో వంతెనలు నిర్మిస్తున్న తల్లి.. ఎక్కడంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చైనాలో హెనెన్ ప్రావిన్స్ లో నివసిస్తున్న మెంగ్ అనే ఓ మహిళ తన కొడుకు స్కూలుకు వెళ్లేందుకు అలాగే క్షేమంగా తిరిగి వచ్చేందుకు ఈ ఆలోచన చేసింది.కొడుకు పాఠశాలకు వెళ్లి తిరిగి క్షేమంగా వస్తాడో లేదొ అన్న ఆందోళనలో, మార్గమధ్యంలో ఉన్న ట్రాఫిక్ ను అధికమించి అతడు ఇంటికి వస్తాడో లేదో అన్న విషయం వల్ల చివరికి ఆవిడ ఈ నిర్ణయం తీసుకుంది.

ఆ నగరంలో తల్లిదండ్రులు అధికారులకు అనేకమార్లు తమ సమస్యను విన్నవించుకున్నా పట్టించుకోకపోవడం., కనీసం ఆ ప్రాంతంలో ఓ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని అధికారులకు విన్నవించుకున్న ఎవరూ పట్టించుకోకపోవడంతో చివరకు ఓ మహిళ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

దీంతో ఆ మహిళ తన కుమారుడి కోసం రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లు నిర్మించాలని నిర్ణయం తీసుకుంది.ఇందుకోసం అధికారుల అనుమతి తీసుకుని ఒక నిర్మాణం పూర్తి చేయగా మరొకటి పునాదుల స్థాయిలో నిర్మాణం కొనసాగుతోంది.

అయితే ఆ వంతెనలను తానే నిర్మిస్తున్నాన్న విషయం తన కొడుక్కి చెప్పలేదు.ఈ సందర్భంగా ఆవిడ మాట్లాడుతూ.తాను బోలెడంత డబ్బు పోగేసుకొని చనిపోవాలని అనుకోవడం లేదని, అంతేకాకుండా తన కొడుకుకు భారీగా డబ్బులు అందజేయాలని కూడా లేదని తెలియజేసింది.ఇక పూర్తయిన వంతెనకు ఆవిడ విస్డం బ్రిడ్జ్ అని నామకరణం చేసింది.

ఈ బ్రిడ్జి పై వెళ్లే విద్యార్థులు చదువులో బాగా రాణించాలని కోరుకుంటున్నట్లు తెలియజేస్తుంది.ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ప్రపంచవ్యాప్తంగా ఆమె చేసిన పనికి నెటిజన్స్ పెద్ద ఎత్తున పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

#China #Social Meida #Footbridges #Built #China Mother

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు