అర్థరాత్రి రోడ్డుపై ఆడవారికి సెక్యూరిటీ ఎంత తెలుసుకునే ప్రయత్నం చేసిన లేడీ పోలీస్‌ ఆఫీసర్‌.. నిల్చుని సెల్యూట్‌ చేయాల్సిందే  

Viral News About Kerala Kozhikode Dgp Mehrin -

అర్థరాత్రి మహిళ రోడ్డు మీద తిరిగినప్పుడు నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు అంటూ ఆనాడు గాంధీ మహాత్ముడు అన్నాడు.అంటే ఇప్పటికి కూడా మనకు నిజమైన స్వాతంత్య్రం రానట్లే.

Viral News About Kerala Kozhikode Dgp Mehrin

ఎందుకంటే అర్థరాత్రి కాదు, కొన్ని ఏరియాల్లో పట్టపగలు కూడా ఒంటరిగా మహిళలు తిరిగే పరిస్థితి లేదు.

ఇలాంటి దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న మహిళల రక్షణకు ప్రభుత్వాలు చాలా పథకాలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నా ఏది కూడా వర్కౌట్‌ అవ్వడం లేదు.

అర్థరాత్రి రోడ్డుపై ఆడవారికి సెక్యూరిటీ ఎంత తెలుసుకునే ప్రయత్నం చేసిన లేడీ పోలీస్‌ ఆఫీసర్‌.. నిల్చుని సెల్యూట్‌ చేయాల్సిందే-General-Telugu-Telugu Tollywood Photo Image

లేడీ ఆఫీసర్స్‌ ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా ఆకతాయిలు మాత్రం అల్లరి చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు.

కేరళ కోజికోడ్‌ డీసిపీ మెహరీన్‌ అత్యంత పెద్ద సాహసం చేసి తాను బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఏరియాలో సెక్యూరిటీ, సేఫ్టి ఏ మేరకు ఉందో తెలుసుకునే ప్రయత్నం చేసింది.

ఒక మహిళ పోలీసు అధికారి అయ్యి ఉండి ఆమె చేసిన సాహసంను దేశ వ్యాప్తంగా యువత అభినందిస్తున్నారు.అర్థరాత్రి కోజికోడ్‌ బస్ట్‌ స్టాండ్‌ వద్ద ఇద్దరు కానిస్టేబుల్స్‌తో కలిసి నిల్చుంది.

ఆమె ఆ సమయంలో అర్థగంట పాటు అక్కడ నిల్చుంది.వారి వద్దకు ఇద్దరు ముగ్గురు కుర్రాలు వచ్చి వారి వంక అదోలా చూస్తూ వెళ్లి పోయారు.

దగ్గరకు వచ్చి అసభ్యంగా అయితే ప్రవర్తించలేదు.

అక్కడ నుండి అలా అలా ముందుకు వెళ్లారు.చాలా చోట్ల కాస్త తేడాగా చూడటంతో పాటు, దగ్గరకు వచ్చి రోడ్డుపై ఈ టైంలో ఏం పని అంటూ ప్రశ్నించారు.మొత్తం 8 గంటల పాటు మెహరీన్‌ కోజికోడ్‌ రోడ్లపై తిరుగుతూ డ్యూటీ చేసింది.ఆడవారికి సెక్యూరిటీ ఇంకా పెంచాల్సిందే అంటూ ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది.8 గంటల పాటు మెహరీన్‌ రోడ్లపై తిరిగినా ఆమెను ఎవరు గుర్తు పట్టక పోవడం విశేషం.విషయం తెల్సిన కోజికోడ్‌ జనాలు అవాక్కయ్యారు.తమకు ఇలాంటి డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ ఆఫీసర్‌ లభించినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇలాంటి డేరింగ్‌ లేడీ ఆఫీసర్‌ గురించి అంతా తప్పకుండా తెలుసుకోవాలి, ఎంతో మందికి ఇన్సిపిరేషన్‌ అయిన మెహరీన్‌ గారి సాహసంను మీ సన్నిహితులకు షేర్‌ చేయండి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Viral News About Kerala Kozhikode Dgp Mehrin Related Telugu News,Photos/Pics,Images..

footer-test