వైరల్: కొత్త తరహా పెళ్లి పిలుపు.. ఆన్‌లైన్‌ లో చూసి ఆశీర్వదించండి.. పెళ్లి భోజనాలు ఇంటికే..!

మన జీవితంలో ఒకే ఒక్కసారి వచ్చే సందర్భాలలో పెళ్లి ఒకటి. పెళ్లి తంతు మానవ జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది.

 Viral, New Type Of Wedding Invitation, Look Online, Blessings, Wedding Dinners ,-TeluguStop.com

అందుకే కాబోలు పెళ్లి చేసుకునే సమయం వచ్చినప్పుడు ఆ పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు తల్లిదండ్రులు వారికి స్తోమతకు తగ్గట్టుగా ఆ పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించడానికి ప్రయత్నాలు చేస్తారు.వారి కుటుంబ సభ్యులకు అలాగే వారి సన్నిహితులను పిలిచి ఎంతో ఆడంబరంగా వివాహాలను జరిపించే రోజులు ఇవి.అయితే ప్రస్తుతం ఈ పరిస్థితి లేకుండా పోతోంది.దీనికి కారణం కరోనా మహమ్మారి.

కరోనా రాకతో ఈ ఆడంబరాలకు మొత్తం బ్రేక్ పడింది.కరోనా నిబంధనలను అనుసరిస్తూ అతి తక్కువ మందితో పెళ్లిళ్లు చేసుకోవాలన్న రూల్స్ వల్ల ఎక్కువమంది పెళ్లిళ్లకు కలవలేకపోతున్నారు.

ఇకపోతే పెళ్లిళ్ల సమయంలో వారి స్తోమతను చూపించుకోవడానికి ఎక్కువగా వారు పెళ్లి భోజనానికి ప్రాముఖ్యత చూపిస్తారు.పెళ్లి భోజనాలు వద్ద వారి స్టేటస్ ను చూపిస్తారని ఎంతో మంది అనుకుంటూ ఉంటారు.

పెళ్లికి వచ్చిన వారికి అనేక రకాల వంటకాలతో బోజనాలు వడ్డిస్తూ వారిని తృప్తి పరుస్తారు.ఇకపోతే.తాజాగా ఓ వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వెడ్డింగ్ కార్డు చూస్తే దాదాపు అందరు షాక్ తినాల్సిందే.

దీనికి కారణం ఆ పెళ్లి కార్డులో వారి బంధువులను మీరు పెళ్లికి రానవసరం లేదు.కేవలం ఆన్లైన్లో మీరు జాయిన్ అయితే చాలు అంటూ అది కూడా ఫలానా సమయంలో లాగిన్ అవ్వాలి అంటూ యూజర్ నేమ్, పాస్వర్డ్, అలాగే లాగిన్ కావాల్సిన లింక్ లాంటి అన్ని కార్డులో ప్రింట్ చేసి ఇచ్చారు.

ఆ పెళ్ళి తర్వాత మీ ఇంటికి మా తరఫున విందు భోజనం పార్సిల్ పంపిస్తామని చెప్పారు.దీంతో శుభలేఖ ఇచ్చిన ప్రతి ఇంటికి పెళ్లి రోజున విందు భోజనం కూడా పంపించారు.ఈ విందు భోజనంలో వారు ఏకంగా 19 రకాల వెరైటీలు ఉన్న మెనూను కూడా పెళ్లి కార్డుతో ఇచ్చి షాక్ కు గురి చేస్తున్నారు.ఇంకేముంది పెళ్లి అంత ఇంట్లోనే కూర్చొని వెబ్ నార్ లో చూసి వారిని ఆశీర్వదించి, చివరికి వారు పంపించిన పార్సెల్ తినేస్తే సరాసరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube