వైరల్... అసలు సిసలు కరోనా పెళ్లి ఇదేనంటున్న నెటిజన్లు

ప్రస్తుతం దేశంలో కరోనా విజ్రుంభిస్తోంది.కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి ఉంది.

 Viral Netizens Who Think This Is The Real Sisal Corona Wedding-TeluguStop.com

అయితే కరోనా మొదటి వేవ్ లో కేసులు ఎక్కువ అయినా మరణాలు మాత్రం సెకండ్ వేవ్ లో ఉన్నంతలా లేవు.అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించకున్నా ఎవరి గ్రామం, నియోజకవర్గం పరిరక్షణ నిమిత్తం స్వచ్ఛంద లాక్ డౌన్ ను విధించుకుంటున్నారు.

దీంతో ప్రభుత్వం కొన్నింటిపై అంక్షలు విధించింది.ముఖ్యంగా కరోనా విజ్రుంభించేందుకు పెళ్లిళ్ల వలన ఎక్కువ అవకాశం ఉంది.

 Viral Netizens Who Think This Is The Real Sisal Corona Wedding-వైరల్… అసలు సిసలు కరోనా పెళ్లి ఇదేనంటున్న నెటిజన్లు-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందుకే కఠిన నిబంధనలతో పెళ్లిళ్లకు పోలీసులు అనుమతిస్తున్నారు.అయితే కొద్ది మందితో అనుమతించినా పెళ్లి నిర్వహించుకునే వారు కరోనా పట్ల అప్రమత్తంగా ఉంటూ వినూత్నంగా వివాహాలు జరుపుకుంటున్నారు.

తాజాగా ఓ వివాహ వేడుకలు వధూవరులు కర్రల సహాయంతో దండలు మార్చుకుంటూ వివాహం చేసుకున్నారు.ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.అసలు సిసలు కరోనా పెళ్లి ఇదేనంటూ నెటిజన్ లు చేస్తున్న కామెంట్స్ తో ఈ వార్త మరింత వైరల్ గా మారుతోంది.ఈ వివాహం బీహార్ రాష్ట్రంలోని బెగూసరాయ్ లో జరిగింది.

ఇక ఇటువంటి వివాహాలు జరుపుకుంటే ఇక కరోనా దరిచేరే అవకాశం ఉండదని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

#Corona Virus #Viral Video #ViralVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు