వైర‌ల్‌.. బాతు డ్యాన్స్ కు ఫిదా అవుతున్న నెటిజ‌న్లు..

డ్యాన్స్ అంటే ఓ క‌ల‌.అది అంద‌రికీ సాధ్యం కాదు.

 Viral  Netizens Showing Love To Duck Dance, Viral Video, Duck Dance, Social Medi-TeluguStop.com

దీనికి ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంత మంది అభిమానులు ఉన్నారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.ఇక మ‌నంద‌రికీ డ్యాన్స్ అన‌గానే గుర్తుకు వ‌చ్చే పేరు మైకెల్ జాక్సన్ మాత్ర‌మే.

ప్ర‌పంచానికి స‌రికొత్త డ్యాన్స్ ట్రెండ్‌ను ప‌రిచ‌యం చేసిన వ్య‌క్తిగా ఆయ‌న‌కు పేరుంది.ఆయ‌న పాప్ సంగీత ప్రపంచంలో రారాజుగా వెలుగొందాడు.

ఎప్పుడో అత‌ను చ‌నిపోయినా కూడా ఇప్ప‌టికీ ఆయ‌నకు అభిమానులు చాలామందే ఉన్నారు.ఇప్ప‌టికీ ఆయ‌న గురించి ఇంట‌ర్‌నెట్‌లో చాలామంది వెతుకుతూనే ఉంటారు.

ఇప్ప‌టి దాకా డ్యాన్స్ లో మైకేల్‌ను మ‌రిపంంచే వారు మాత్రం రాలేద‌నే చెప్పాలి.పైగా అత‌ని మూన్‌వాక్ సిగ్నేచర్ స్టెప్ కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

దీన్ని ఎంతోమంది వేసినా మైకేల్‌ను మాత్రం మించ‌లేదు.కానీ ఇప్పుడు ఓ బాతు కూడా ఈ మూన్ వాక్ స్టెప్ వేసేస్తోంఇ.

అదేంటి మ‌నుషులు డ్యాన్స్ చేస్తారు గానీ బాతులు కూడా ఇలా డ్యాన్స్ చేస్తున్నాయా అనే అనుమానం మీకు క‌ల‌గ‌క మాన‌దేమో.కానీ మీరు విన్న‌ది నిజ‌మే.

ఈ మూన్ వాక్ స్టెప్ వేయాలంటే ప్రతి భాగాన్ని కంట్రోల్ లో ఉంచుకుంటే గానీ సాధ్యం కాదు.

కానీ ఈ బాతు మాత్రం చాలా ఈజీగా ఈ స్టెప్పు వేసేస్తోంది.ఈ బాతు ఇలా డ్యాన్స్ చేయ‌డాన్ని చూస్తే నిజంగానే అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు.ఎందుకంటే అచ్చం మ‌నుషుల్లాగే ఇలా డ్యాన్స్ చేస్తుంటే ప్ర‌తి ఒక్క‌రూ షాక్ అయిపోతున్నారు.

ఓ మైదానం లాంటి ప్రాంతంలో కొన్ని బాతులు ఉండ‌గా అందులో ఓ బాతు ఇలా స‌డెన్‌గా మూన్ వాక్ స్టెప్పు వేయ‌డం మ‌న‌కు క‌నిపిస్తుంది.దీన్నంతా కూడా వీడియో తీసి కల్నల్ DPK పిళ్లే ట్విట్టర్‌లో వేదిక‌గా దీన్ని పోస్టు చేయ‌గా విప‌రీతంగా వైర‌ల్ అయిపోతుంది.

దీన్ని చూసిన వారంతా కూడా మైకేల్ మ‌ళ్లీ బాతు రూపంలో పుట్టాడంటూ కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube